మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ..అక్కినేని నాగార్జున (Nagarjuna), సమంత (Samantha)ల ఫై చేసిన కామెంట్స్ ఫై సినీ లోకమే కాదు యావత్ సినీ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఓ మంత్రిగా బాధ్యత హోదాలో ఉండికూడా..సాటి మహిళా ఫై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అంటావా..? అంటూ సురేఖ ఫై ఆగ్రహపు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చిత్రసీమలో చిరంజీవి (CHiranjeevi) దగ్గరి నుండి ప్రతిఒక్కరు సురేఖ కామెంట్స్ ఫై నిప్పులు చెరుగుతూ ఇది మంచి పద్ధతి కాదంటూ హెచ్చరిస్తున్నారు.
మీ రాజకీయాల కోసం సినిమావాళ్లను లాగితే మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మాములుగా అయితే చిత్రసీమలో ఎవరిపైనైనా రాజకీయ నేతలు కామెంట్స్ చేస్తే ఆ బురద మనకెందుకులే అని సైలెంట్ అవుతారు. కానీ అక్కినేని ఫ్యామిలీ ఫై అలాగే సమంత ఫై పర్సనల్ గా వ్యాఖ్యలు చేయడం తో ప్రతి ఒక్కరు స్పందిస్తూ వస్తున్నారు. చిరంజీవి , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , మంచు విష్ణు , రవితేజ , నాని , కుష్బూ , లావణ్య త్రిపాఠి , అక్కినేని ఫ్యామిలీ , వెంకటేష్ ఇలా ఒక్కరేంటి ఇండస్ట్రీ లోని దాదాపు పాపులర్ నటి నటులు రియాక్ట్ అయ్యారు.
దీంతో సురేఖ తన తప్పును తెలుసుకొని క్షేమపణలు చెప్పడం స్టార్ట్ చేసింది. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించలేదు. అందరి ఎదురుచూపులు కూడా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని చూస్తున్నారు. మాములుగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పవన్ ఏమాత్రం సహించడు. సొంత పార్టీ నేతలైన , అభిమానులైన , తోటి కళాకారులైన ఇలా ఎవ్వరైనా సరే..తప్పు అని హెచ్చరిస్తాడు. కానీ కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఫై సైలెంట్ గా ఉండడానికి కారణం..ఆయన అనారోగ్యం తో బాధపడుతుండడం తో పాటు..మరికాసేపట్లో వారాహి సభ జరగనుంది..ఈ పనుల్లో ఆయన బిజీ గా ఉండడమే అని తెలుస్తుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లడ్డు గురించి ఇష్యూ జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని రోజులు పాటు దీక్షను చేపట్టారు. అయితే లడ్డు విషయంలో ఒక సినిమా ఈవెంట్ లో కార్తీ మాట్లాడిన విషయాన్ని కూడా పట్టించుకున్న పవన్ కళ్యాణ్ ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కూడా ఎందుకు పట్టించుకోలేదు అనేది కొందరి వాదన. వాస్తవానికి కార్తీ విషయంలో తప్పు లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఓపెన్ గా కామెంట్స్ వైరల్ అవుతున్న కూడా పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడకపోవడంతో సమంత ఇష్యూ ని సనాతన ధర్మం డామినేట్ చేసిందని కొంతమంది విమర్శించడం మొదలుపెట్టారు.
ఒక నటిగా సమంతపై ఎంత గౌరవం ఉందో అత్తారింటికి దారేది సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అటువంటిది అలాంటి నటిపై ఓ మంత్రి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే స్పందించకుండా ఉంటాడా..కానీ ప్రస్తుతం ఆయన అనారోగ్యం తో పాటు సభ బిజీ లో ఉండడం తోనే స్పందించలేదని అభిమానులు అంటున్నారు. రేపో..మాపో దీనిపై ఖచ్చితంగా మాట్లాడతారని చెపుతున్నారు.
Read Also : Tirupati Laddu: మొదట కిలో నెయ్యి రూ. 428కి ఇవ్వలేనన్న డెయిరీ..తర్వాత రూ. 320కి ఎలా ఇచ్చింది?: ఆనం