Sankranthi Movies : సంక్రాంతి బరిలో ఇంకో సినిమా.. బాబోయ్ సంక్రాంతికి ఇన్ని సినిమాలా?

అసలైన పెద్ద పండుగ సంక్రాంతికి సినిమాలు క్యూ కడుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
So many Star Heros Movies Ready to Release for Sankranthi

So many Star Heros Movies Ready to Release for Sankranthi

పండగలు వచ్చాయంటే స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లో పడాల్సిందే. గతంలో దసరా, సంక్రాంతి(Sankranthi) పండగలకు స్టార్ హీరోలందరూ తమ సినిమాలతో వచ్చి హిట్స్ కొట్టేవాళ్ళు. మధ్యలో కొన్నాళ్ళు స్టార్ హీరోల సినిమాలు పండగలకు తగ్గినా మళ్ళీ ఇటీవల ఊపందుకుంది. మొన్న దసరాకు భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వర రావు సినిమాలు వచ్చి సందడి చేశాయి. ఇక అసలైన పెద్ద పండుగ సంక్రాంతికి సినిమాలు క్యూ కడుతున్నాయి.

ఇప్పటికే తెలుగులో సంక్రాంతికి జనవరి 12 మహేష్ బాబు గుంటూరు కారం(Guntur Kaaram), తేజ సజ్జ హనుమాన్(Hanuman), జనవరి 13 రవితేజ ఈగల్(Eagle), వెంకటేష్ సైంధవ్‌(Saindhav) సినిమాలు అనౌన్స్ చేశారు. ఇక నాగార్జున నా సామిరంగ, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమాలు కూడా డేట్స్ ఇంకా అనౌన్స్ చేయకపోయినా సంక్రాంతికే వస్తాయని ప్రకటించారు. ఇప్పటికే ఇలా అరడజను తెలుగు సినిమాలు సంక్రాంతికి పోటీ పడటానికి రెడీగా ఉండగా అటు తమిళ్ సినిమాలు కూడా డబ్బింగ్ తో రంగంలోకి దిగుతున్నాయి.

తమిళ్ లో ఇప్పటికే రజినీకాంత్ గెస్ట్ రోల్ చేసిన లాల్ సలాం సినిమా సంక్రాంతికి అనౌన్స్ చేశారు. తాజాగా ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా కూడా సంక్రాంతికి ప్రకటించడంతో ఈసారి సంక్రాంతి పోటీ చాలా గట్టిగానే ఉండబోతుందని తెలుస్తుంది. మరి సంక్రాంతి పందెంలో గెలిచేది ఎవరో చూడాలి.

 

Also Read : Kaun Banega Crorepati 15 : కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రాం లో పుష్ప కు సంబదించిన ప్రశ్న

  Last Updated: 08 Nov 2023, 10:02 PM IST