Allu Arjun : అల్లు అర్జున్ – సంధ్య థియేటర్ ఘటన రోజురోజుకి మరింత జటిలం అవుతుంది. కాంగ్రెస్ నాయకులు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత అతనిపై విమర్శలు చేస్తున్నారు. ఇక పోలీసులను కూడా అల్లు అర్జున్ తన ప్రెస్ మీట్ లో తప్పు పట్టడంతో ఇప్పటికే పోలీసులు సీరియస్ అయి ప్రెస్ మీట్ పెట్టారు.
పోలీసులు ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయించి అరెస్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. నిన్న రాత్రి అల్లు అర్జున్ కి పోలీసులు విచారణకు హాజరవ్వాలని నోటీసులు పంపించారు. నేడు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరవ్వాలని నోటీసులు పంపారు.
Also Read : Jani Master : జానీ మాస్టర్ కి ఆఫర్ ఇచ్చిన రామ్ చరణ్.. చరణ్ జానీ మాస్టర్ కి ఏం చెప్పాడంటే..
అయితే ఈ లోపే నేడు ఉదయం తాజాగా అల్లు అర్జున్ ఇంటి ముందు భారీ గా పోలీసులు గుమికూడారు. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో కలిపి దాదాపు 100 మంది పోలీసులు అల్లు అర్జున్ ఇంటి బయట ఉన్నారు. ఇంటికి వచ్చే దార్లను బారికేడ్స్ తో మూసేసారు. అల్లు అర్జున్ ఇంటికి టాస్క్ ఫోర్స్ డీసీపీ వచ్చారు. దీంతో బన్నీ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది అని ఉత్కంఠ నెలకొంది.
అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తారా? లేక విచారణకు తీసుకెళ్లడానికి వచ్చారా? లేదా ఇక్కడే విచారిస్తారా అని చర్చ జరుగుతుంది. అభిమానులు, టాలీవుడ్ అల్లు అర్జున్ విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.