Nidhhi Agerwal : అవకాశాలు లేక.. రెండేళ్లు అలా చేశా..

Nidhhi Agerwal : టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రమంగా ఎదుగుతూ, ప్రేక్షకులకు మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి "హరిహర వీరమల్లు", రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో "రాజా సాబ్" చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించే అవ‌కాశాన్ని అందుకుంది. చిన్నప్పటి నుంచే సినిమాలపై గల అభిరుచితో నిధి, తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించడంతో పాటు, అనేక సవాళ్లను ఎదుర్కొని, ఈ స్థాయికి ఎదిగింది. ఆమె కథ, కెరీర్‌లో జరిగిన పరిణామాలు, కష్టాలు, విజయాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Published By: HashtagU Telugu Desk
Nidhhi Agerwal

Nidhhi Agerwal

Nidhhi Agerwal : టాలీవుడ్ లో మోస్ట్ అవెయిటెడ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు , రెబల్‌ స్టార్ ప్రభాస్ చేస్తున్న హార్రర్ కామెడీ “ది రాజా సాబ్” అనే రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించే అవకాశం లభించిన లక్కీ గర్ల్ నిధి అగర్వాల్, తన కెరీర్‌లో దూసుకెళ్లేందుకు సన్నద్ధమైంది. ఇవి పాన్ ఇండియా చిత్రాలు కావడంతో ఆమెకు ప్లస్‌ కానున్నాయి.

అయితే, నిధి ఈ స్థాయిలో హీరోయిన్ అవడం కోసం ఎంత సమర్ధతతో శ్రమించిందో తెలుసుకోవడం ఆసక్తికరమే. చిన్నప్పటి నుండి సినిమాలపై నిధికి గల అభిరుచిని ఆమె పంచుకుంటూ, దీపికా పదుకొణెని చూసి, తాను కూడా సినిమాల్లో నటించాలని ఆశపడిందని పేర్కొంది. కానీ ఆమె ఈ నిర్ణయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు, ముందుగా చదువు పూర్తిచేయాలని ఆమె తండ్రి సూచించారని నిధి తెలిపింది.

Smart Phone Vs Congo War : ఆ దేశంలో యుద్ధానికి.. మన స్మార్ట్‌ఫోన్‌కు లింకు.. ఎలా ?

చదువు పూర్తయ్యాక, నిధి ముంబై వెళ్లి సినీ పరిశ్రమలో అవకాశం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫోటోలు తీసుకుని, అనేక ఆఫీసుల చుట్టూ తిరిగినట్లు ఆమె ఇటీవల ఇంటర్వ్యూలో పేర్కొంది. అనేక ప్రయత్నాలు చేసినట్లు.. కొంతమంది పది సార్లు ఆమెను తిరస్కరించినా, నిధి తన పోరాటాన్ని కొనసాగించి, చివరకు “మున్నా మైఖేల్” సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పొందింది. ఈ సినిమా ఆమెకు మంచి సినీ ఇండస్ట్రీకి పరిచయాన్ని ఇచ్చింది. ఆ తర్వాత “సవ్యసాచి” చిత్రంలో కూడా అవకాశమొచ్చి, అక్కడి నుండి టాలీవుడ్ లో తన స్థానం ఏర్పడింది.

అయితే, పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో ఆమెకు అగ్రిమెంట్ సంతకంలో కారణంగా, ఆమెకు మరే ఇతర సినిమాల్లో నటించే అవకాశాలు తగ్గాయి. ఆ సినిమా చేస్తున్న సమయంలో ఆమె అగ్రిమెంట్ ప్రకారం, మరే సినిమాల్లో పని చేయకూడదని సైన్ చేసింది. కానీ, “హరిహర వీరమల్లు” సినిమా వాయిదా పడిన సమయంలో, ప్రభాస్ హీరోగా నటిస్తున్న “రాజా సాబ్” సినిమాలో భాగమయ్యే అవకాశాన్ని ఆమె సానుకూలంగా స్వీకరించింది.

“హరిహర వీరమల్లు” సినిమాలో నిధి పంచమి అనే పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. ఆ సినిమాలో యువరాణిగా ఆమె కొన్ని యుద్ధాల సీన్లలో కనిపిస్తారని చెప్పారు. ప్రభాస్ తో నటిస్తున్న “రాజా సాబ్” చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ, అది చాలా కొత్తదిగా ఉంటుందని, ఈ పాత్ర ప్రేక్షకులను పూర్తిగా ఆకర్షించేలా ఉంటుంది అని చెప్పింది. ఈ హార్రర్ కామెడీ సినిమాను తల్లిదండ్రులతో కలిసి చూడవచ్చని ఆమె సూచించింది.

నిధి తన కెరీర్ లో మరొక ముఖ్యమైన చిత్రాన్ని “సఖి”ను కూడా గుర్తు చేస్తూ, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఎంతో ఇష్టపడుతుందని, ఈ సినిమాను ఎన్నో సార్లు చూసినట్లు తెలిపింది.

Shocking : కలియుగ భార్యామణి.. భర్త కిడ్నీ అమ్మి.. వచ్చిన డబ్బులతో ప్రియుడితో పరార్‌..

  Last Updated: 02 Feb 2025, 01:21 PM IST