మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi )అంటే అందరికి గుర్తుకు వచ్చేది.. డాన్స్‌లు, ఫైట్స్. ఈ రెండిటిలో ఏది తక్కువైనా అభిమానులు ఒప్పుకోరు. అందుకనే చిరంజీవి ఇప్పటికి కూడా డాన్స్‌లు, ఫైట్స్ చేస్తూ అదరగొడుతున్నారు. ఇక ఆడియన్స్ కి చిరంజీవి పై ఉన్న అంచనాలను అందుకోవడం కోసం.. మూవీ మేకర్స్ కూడా భారీగా ఖర్చు చేయడంలో ఏ మాత్రం ఆలోచించారు. ఈక్రమంలోనే ఓ సినిమాలో ఒక యాక్షన్ సీన్ కోసం అప్పట్లోనే 50వేలు ఖర్చు చేసి దాదాపు ఆరు వేల కుండలను తయారు చేయించారట. ఇంతకీ అది ఏ సినిమా అని ఆలోచిస్తున్నారా..?
చిరంజీవి మాస్ కమర్షియల్ సినిమాలతో పాటు తనలోని నటుడిని చూపించేందుకు అప్పుడప్పుడు కొన్ని ఆర్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు. అలా చిరంజీవి నటించిన ఓ సినిమా ‘ఆపద్బాంధవుడు’ (Aapadbandhavudu). కళాతపస్వి కె విశ్వనాథ్(K Viswanath) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 1992లో రిలీజ్ అయ్యింది. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా ఆర్ట్ ఫిలిం అయ్యినప్పటికీ.. అక్కడ హీరోగా నటిస్తున్నది మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి. దీంతో అభిమానులు ఒక్క యాక్షన్ సీక్వెన్స్ అయినా కోరుకుంటారు.
అందుకోసమే మూవీలో ఎద్దుతో పోరాట సన్నివేశాన్ని క్రియేట్ చేశారు. ఇక ఆ ఫైట్ సీక్వెన్స్ ని కుండలు తయారు బ్యాక్‌డ్రాప్ లో డిజైన్ చేశారు. దీంతో ఆ సీక్వెన్స్ కోసం భారీగా కుండలు కావాల్సి వచ్చింది. ఇందుకోసం చిత్ర నిర్మాతలు సుమారు రూ.50వేలు ఖర్చు చేసి దాదాపు ఆరు వేల కుండలను తెప్పించారట. ఈ ఫైట్ సీక్వెన్స్ ని దాదాపు నాలుగు రోజులు పాటు షూట్ చేశారట. సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో సీన్ ఓకే కాకపోతే.. పగిలిపోయిన కుండల స్థానంలో మళ్ళీ కొత్త కుండలు తీసుకొచ్చి పెట్టేవారట. మరి ఆ ఫైట్ సీక్వెన్స్ ని ఒకసారి మీరు కూడా చూసేయండి.
Also Read : Hanuman : అదరగొడుతున్న హనుమాన్.. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ.. నాలుగు రోజుల్లోనే..