పీఎంజే జ్యూవెల్స్ (PMJ Jewellery) తమ బ్రాండ్ ప్రచారంలో కొత్తదనానికి శ్రీకారం చుట్టింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) గారాల పట్టి ఘట్టమనేని సితార(Sitara Ghattamaneni)ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకొని మరో కొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. సితారకు ఉండే ప్రత్యేకత, అభినయంతో ఈ జ్యువెలరీ కలెక్షన్లు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
ఈ కొత్త క్యాంపెయిన్‌లో పీఎంజే జ్యూవెల్స్ భారతీయ సంప్రదాయాన్ని, వారసత్వాన్ని ప్రతిబింబించే ఆభరణాలను ఆవిష్కరించింది. నగలు, వజ్రాలు, కెంపులతో కళాత్మకంగా తయారైన ఈ ఆభరణాలు వివిధ వేడుకలకు అనువుగా ఉండేలా డిజైన్ చేశారు. పెళ్లిళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కలెక్షన్ రాయల్ లుక్‌ను అందిస్తుందని పీఎంజే ప్రతినిధులు తెలిపారు. సితార ధరించిన ఆభరణాల ఫొటోలను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించడం విశేషం. ఈ లేటెస్ట్ కలెక్షన్ భారతీయ నగల వైభవాన్ని, ప్రత్యేకతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా రూపొందించారని పీఎంజే జ్యూవెల్స్ పేర్కొంది. ఈ ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా భారతీయ వారసత్వాన్ని చాటి చెబుతాయి.
సితార తన బ్రాండ్ అంబాసిడర్‌గా సంపాదించిన మొత్తాన్ని మహేశ్ బాబు ఛారిటబుల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం ఆమె చిన్న వయసులోనే సామాజిక బాధ్యత పట్ల తన చైతన్యాన్ని తెలియజేస్తోంది. పీఎంజే జ్యూవెల్స్ ఆమెను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోవడం మరింత ప్రత్యేకతను కల్పించింది. ఈ క్యాంపెయిన్ ద్వారా పీఎంజే జ్యూవెల్స్ ఆభరణాలకు కొత్తదనాన్ని అందించడం మాత్రమే కాకుండా భారతీయ కళాత్మకత, నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది.
Read Also : Plane Crash : ఇళ్లలోకి దూసుకెళ్లిన విమానం.. 10 మంది మృతి.. 17 మందికి గాయాలు