చిరంజీవి (Chiranjeevi) మాజీ అల్లుడు, శ్రీజ మొదటి భర్త భరద్వాజ (Shirish Bharadwaj) కన్నుమూశారు. ఈ విషయాన్నీ నటి శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసినట్లుగా సమాచారం. లంగ్స్ డ్యామేజ్‌తో హాస్పిటల్‌లో చేరిన ఆయన ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లుగా తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
చిరంజీవి రెండో కూతురు శ్రీజ..శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ ఆర్య సమాజ్ లో పెద్దలను ఎదిరించి వీరిద్దరూ వివాహాం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. 2012లో తనను వేధిస్తున్నరాంటూ శ్రీజ.. శిరీష్ భరద్వాజ్ పై కేసు పెట్టింది. ఆ తర్వాత 2014లో శ్రీజ.. శిరిష్ నుంచి విడాకులు తీసుకుంది. అప్పటికే వీరికి ఓ కుమార్తె పుట్టింది. ఆ తర్వాత వీళ్లిద్దరు మరో వివాహాం చేసుకొని జీవితంలో సెటిలయ్యారు. అప్పట్లో వీరి ప్రేమ, పెళ్లి, విడాకులు చిత్రసీమలో హాట్ టాపిక్ అయ్యాయి. విడాకుల అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2016లో బెంగళూరులో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఈ జంటకి కూడా ఒక కుమార్తె పుట్టింది. అయితే వీరు గతేడాది విడిపోయారు. మొత్తంగా శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకోవడం , విడాకులు తీసుకోవడం జరిగింది.
Read Also : Union Budget 2024 : కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవుల కోసం గుడ్ న్యూస్ !