Site icon HashtagU Telugu

Devi Sri : మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ఇంట సంబరాలు..

Saagar

Saagar

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ (Devi Sri) ఇంట సంబరాలు మొదలయ్యాయి.దేవి శ్రీ తమ్ముడు సింగర్ సాగర్ (Singer Sagar) తండ్రయ్యాడు.
గురువారం పండంటి మగబిడ్డకు ఆయన భార్య జన్మనిచ్చింది..ఈ విషయాన్నీ స్వయంగా సాగర్ సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు. ఈ వార్త చూసి సినీ ప్రముఖులు సాగర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2019 లో డాక్టర్ మౌనికని సాగర్ పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 21న మౌనిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారట. కాగా ఈ జంటకి గతంలోనే ఒక బిడ్డ పుట్టినట్లు సమాచారం… ఇప్పుడు పుట్టిన మగ బిడ్డ రెండో సంతానం.

We’re now on WhatsApp. Click to Join.

ఇక సాగర్ ..దేవి మ్యూజిక్ డైరెక్షన్ లోనే ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దేవి మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఇటీవల దేవి కి అవకాశాలు పూర్తిగా లేకుండా పోయాయి. ఒకప్పుడు ఏ సినిమా పాటలు విన్న దేవి మ్యూజిక్ వినిపించేది..కానీ ఈ మధ్య దేవి సాంగ్స్ అనేవి లేకుండా పోయాయి. థమన్ హావ బాగా కొనసాగుతుంది.

ప్రస్తుతం మాత్రం దేవి చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. ఈ ఆరు చిత్రాలు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. పుష్ప 2, తండేల్, ఉస్తాద్ భగత్ సింగ్, కంగువ, రత్నం, ధనుష్-శేఖర్ కమ్ముల సినిమా ఉంది.

Read Also : Prabhas Kalki : కల్కి మాస్టర్ ప్లాన్.. మొత్తం 9 భాగాలా.. రెబల్ ఫ్యాస్ మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్..!