Site icon HashtagU Telugu

Nandu – Geetha Madhuri : మరోసారి తల్లితండ్రులైన నందు – గీతామాధురి.. పండంటి బాబు..

Singer Geetha Madhuri gave birth to baby boy

Singer Geetha Madhuri gave birth to baby boy

నటుడు నందు(Nandu) – సింగర్ గీతామాధురి(Geetha Madhuri) మరోసారి తల్లితండ్రులయ్యారు. టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. ఇద్దరూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ జంటకు ఒక ఆడపిల్ల ఉంది. తాజాగా ఓ పండంటి బాబుకి జన్మనిచ్చారు.

సింగర్ గీతామాధురి ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియచేసింది. తనకు 10వ తేదీన బాబు పుట్టాడని తెలుపుతూ, మీ విషెష్ కి, బ్లెస్సింగ్స్ కి ధన్యవాదాలు అని చెప్పింది. ఇటీవలే కొన్ని రోజుల క్రితం గీతామాధురి సీమంతం ఫోటోలు షేర్ చేసారు.

బాబు పుట్టాడని వార్తలు వచ్చినా తాజాగా గీతామాధురి అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానులు, ప్రముఖులు, నెటిజన్లు ఈ జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొన్ని రోజుల క్రితమే బాబు పుట్టినందుకు దాదాపు 800 మందికి అన్నదానం కూడా నిర్వహించారు.

 

Also Read : Samantha: లవ్ గురించి స్పెషల్ పోస్ట్ చేసిన సమంత.. ప్రేమ ఎప్పుడు ప్రత్యేకమంటూ?