Amala : అమలకి నటన రాదు అని చెప్పారు.. అయినా వినకుండా హీరోయిన్‌గా తీసుకున్న దర్శకుడు..

1987లో అమల, కమల్ హాసన్(Kamal Haasan) కలయికలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రం 'పుష్పకవిమానం'(Pushpaka Vimanam).

  • Written By:
  • Publish Date - October 16, 2023 / 09:33 PM IST

ఒకప్పటి హీరోయిన్ అమల(Amala).. సౌత్ టు నార్త్ స్టార్ హీరోలు, దర్శకులతో పని చేసి స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. అయితే కెరీర్ మొదటిలో ఈమె కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. బాలీవుడ్(Bollywood) లో స్టార్ట్ అయిన ఒక సినిమా ఆగిపోవడం, కోలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలో నటించినా పేరు రాకపోవడం వంటివి జరిగాయి. అవన్నీ ఎదుర్కొని నటిగా తనని తాను నిరూపించుకొని.. దర్శకనిర్మాతలు తన డేట్స్ కోసం ఎదురు చూసేలా చేసుకుంది. 1987లో అమల, కమల్ హాసన్(Kamal Haasan) కలయికలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రం ‘పుష్పకవిమానం'(Pushpaka Vimanam).

సింగీతం శ్రీనివాస్(Singeetam Srinivasa Rao) తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్ కోసం పెద్ద వెతుకులాటే జరిగింది. అమల కంటే ముందు ఇద్దరు హీరోయిన్స్ కోసం సింగీతం ప్రయత్నించారు. మొదటిగా ఈ సినిమాలో ‘నీలమ్‌ కొఠారి’ అనే ముంబయి యాక్ట్రెస్ ని హీరోయిన్ అనుకున్నారు. ఈక్రమంలోనే ఆమెను కలిసి కథ కూడా వినిపించారు సింగీతం. అయితే ఆమె కొన్ని కండిషన్స్ పెట్టిందట. అయితే ఈ మూవీ ఒక ప్రత్యేక సినిమా కావడంతో సింగీతం ఆ కండిషన్స్ కి నో చెప్పి ఆమెను వదిలేశారు.

ఆ తరువాత ‘మాధురీదీక్షిత్‌’ని అనుకోని ఆమెను కలవాలని ప్రయత్నిస్తే.. ఆమె ఇలాంటి కథలు చేయదని చెప్పి మాధురీ పీఏ సింగీతంని వెనక్కి పంపించేశారు. ఇక కొన్ని రోజులు తరువాత సింగీతం శ్రీనివాస్ కి ఒక సన్మాన కార్యక్రమం జరిగింది. అక్కడికి అమల వచ్చింది. ఆమెను చూసిన సింగీతం.. అమల ఫేస్ చాలా నేచురల్ గా ఉంది. తన సినిమాకి అమల సెట్ అవుతుందని భావించారు. అయితే కొంతమంది.. ఆమెని వద్దని చెప్పారట. అమలకి నటన రాదు అని చెప్పారట. కానీ సింగీతం అవేవి పట్టించుకోకుండా అమలని తీసుకున్నారు. ఈ విషయాన్ని సింగీతం స్వయంగా ఒక సమయంలో తెలియజేశారు. ఇక ఆ సినిమాలో అమల తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది.

 

Also Read : Siddhu Jonnalagadda : డీజే టిల్లు నెక్స్ట్ సినిమా.. వెరైటీ టైటిల్‌తో.. లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో..