బేబీ ఫేమ్ వైష్ణవి (Vaishnavi Chaitanya) ప్రస్తుతం ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. చిన్న చిన్న షార్ట్స్ ఫిలిమ్స్ తో యూత్ ను ఆకట్టుకుంటూ వస్తున్న వైష్ణవి ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా వెండితెర ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు బేబీ (Baby) మూవీ తో హీరోయిన్ గా మరి..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు చిత్రసీమకు మరో టాలెంటెడ్ హీరోయిన్ దొరికిందని అంత మాట్లాడుకునే స్థాయికి చేరింది. యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న వైష్ణవి కోసం దర్శక , నిర్మాతలు పోటీపడుతున్నారు. వైష్ణవి ఎంత అడిగితే అంత రెమ్యూనరేషన్ (Vaishnavi Chaitanya Remuneration) ఇస్తామంటూ ఆమె ఇంటివద్ద పడిగాపులు కాస్తున్నారట. తాజాగా ఈ భామకు మరో యంగ్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం.
Read Also : Bull Dog Ant: ఈ చీమ చాలా డేంజర్.. కుడితే మనిషి ప్రాణాలు పోవాల్సిందే?
‘డీజే టిల్లు’ (DJ Tillu ) సినిమాతో భారీ విజయం అందుకున్న యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. డీజే టిల్లు కు ముందు ‘గుంటూరు టాకీస్’, ‘కల్కి’ చిత్రాల్లో పాత్రలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘మా వింత గాధ వినుమా’ తో హీరోగా సక్సెస్ అయ్యారు. కానీ డీజే టిల్లు మాత్రం అసలైన స్టార్ ను చేసింది. ప్రస్తుతం సిద్దు డీజే టిల్లు కు సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత నందిని రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడట. అందులో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ చేసి సక్సెస్ అందుకున్న భాస్కర్..ఈసారి కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రెడీ చేశారట. అందులో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాముఖ్యం ఉండడం తో వైష్ణవి ని ఎంపిక చేసినట్లు చెపుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీని తర్వాత దిల్ రాజు ..ఆశిష్ తో ఈ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాలో కూడా వైష్ణవి నే హీరోయిన్ అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి తెలుగు ఇండస్ట్రీ లో తెలుగు అమ్మాయి హీరోయిన్ గా బిజీ కావడం అందర్నీ సంతోష పరుస్తుంది.