Tillu Square First Day Collections సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రాం డైరెక్షన్ లో వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగినట్టుగానే ప్రచార చిత్రాలు ఉండటంతో టిల్లు స్క్వేర్ పై ఇంకాస్త అంచనాలు పెరిగాయి. సినిమాలో అనుపమ గ్లామర్ ట్రీట్ ఆడియన్స్ కు కన్నుల విందు అనేలా ట్రైలర్ ప్రెజెంట్ చేశారు. ఇంకేముందు యూత్ కు కావాల్సిన అన్ని అంశాలు ఉండటంతో భారీ అంచనాలతో రిలీజైన టిల్లు స్క్వేర్ ఆ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది.
టిల్లు స్క్వేర్ సినిమా ఫస్ట్ డే భారీ వసూళ్లను రాబట్టింది. స్టార్ బోయ్ సిద్ధు రేంజ్ పెంచేలా టిల్లు స్క్వేర్ వసూళ్లు ఉన్నాయి. సినిమా మొదటి రోజే 23.7 కోట్ల కలెక్షన్స్ తో అదరగొట్టేసింది. సినిమాకు ఏర్పడ్డ బజ్ కి అదే రేంజ్ బుకింగ్స్ వచ్చాయి. ఇక సినిమా ఫస్ట్ షోతోనే యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకోగా ఫస్ట్ డే వసూళ్లు అదిరిపోయాయి.
సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ లో హయ్యెస్ట్ ఫస్ట్ డే.. కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. డీజే టిల్లు హవా కొనసాగించేలా టిల్లు స్క్వేర్ హంగామా ఉంది. సినిమాకు మరో సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సో టిల్లు హంగామా ఇంకా కొనసాగుతూనే ఉంటుందని చెప్పొచ్చు.
Also Read : Prabhas Kalki 2898 AD : ఇంతకీ కల్కి లో విలన్ ఎవరు.? నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటి..?