Site icon HashtagU Telugu

Siddharth : పాపం సిద్ధార్థ్.. అసూయకి బాధకు మధ్య స్థితి..!

Siddharth Attack On Animal In Award Function

Siddharth Attack On Animal In Award Function

Siddharth వందల కోట్ల బడ్జెట్ పెట్టినా ప్రేక్షకులు మొదటి ఆట చూసి సినిమా సూపర్ అంటే తప్ప దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. మేం 200 కోట్లు పెట్టి సినిమా తీశాం మీరు కచ్చితంగా బాగుందని చెప్పాల్సినే అనే ధైర్యం చేయలేరు. ఎందుకంటే ఒక సినిమా తీసేప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కసారి పబ్లిక్ లోకి వెళ్లాక వారి చెప్పిందే వేదం.. వారి ఇచ్చిందే ఫలితం అన్నట్టుగా ఉంటుంది.

అయితే ఈ క్రమంలో కొందరు తాము ఎంతగానో ప్రేమించి చేసిన సినిమా ఆడియన్స్ కు రీచ్ అవ్వకపోతే దాని వల్ల బాగా హర్ట్ అవుతారు. ప్రేక్షకులకు ఏదో మంచి సినిమా అందిద్దామనుకున్న వారిని పట్టించుకోరు అన్నట్టు ఉంటుంది. కానీ చెప్పే కథ.. తీసే విధానం కరెక్ట్ గా ఉండాలే కానీ కచ్చితంగా ఆడియన్స్ ప్రతి సినిమాను ఆదరిస్తారు.

ఇంతకీ ఈ లీడ్ అంతా దేనికి అంటే రీసెంట్ గా ఒక అవార్డ్ ఫంక్షన్ లో సిద్ధార్థ్ తను తీసిన చిత్తా అదే తెలుగులో చిన్నాగా రిలీజ్ చేశారు. ఆ సినిమాను మృగం అనే టైటిల్ తో రిలీజ్ చేస్తే బాగుండేద్మో. కొందరు మగాళ్లు మృగం లాంటి సినిమాలనే ఇష్టపడతారు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అంటే తను తీసిన సినిమా అలాంటి మృగాలను ఇష్టపడే ఆడియన్స్ కు నచ్చలేదు అన్నట్టు చెప్పాడు.

ఇక సిద్ధార్థ్ మాట్లాడిన మృగం అంటే ఇన్ డైరెక్ట్ గా అతను రణ్ బీర్ కపూర్ యానిమల్ గురించి చెప్పాడు. అయితే ముందు చెప్పినట్టుగా తీసే సినిమా కరెక్ట్ గా ఉంటే అది మృగం అయినా చిన్నా అయినా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. అది ఆలోచించకుండా తను తీసిన సినిమా ఎందుకు ఆదరించలేదు అంటూ ఆడియన్స్ ని తక్కువ అంచనా వేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు.

సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ చూస్తే అసూయకు బాధకు మధ్య స్థితి అంటూ కొందరు రెస్పాండ్ అవుతున్నారు.  సిద్ధార్థ్ నిజంగానే అది బాధతో చెప్పాడు కానీ ఆడియన్స్ మాత్రం నేను ఇంత మంచి సినిమా తీస్తే చూడలేదు కానీ మృగాన్ని మాత్రం హిట్ చేశారని అసూయ పడినట్టుగానే అర్ధం చేసుకున్నారు.

Also Read : MI vs CSK: ముంబైతో మ్యాచ్‌కు ముందు చెన్నైకు బిగ్ షాక్‌.. ఇది ఊహించలేదు..!
Exit mobile version