SSR: నాని ‘శ్యామ్ సింగరాయ్’ వరల్డ్ రికార్డ్.. ఇండియాలో నెం.1, ప్రపంచంలో నం.3!

మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయనలానే స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, టాలీవుడ్ లో సత్తా చాటుతోన్న హీరోల్లో నాని ఒకడు. నేచురల్ స్టార్ గా కూడా ఆయన ఎదిగాడు. కెరీర్ ఆరంభంలోనే అష్టాచమ్మ లాంటి భారీ విజయాన్ని అందుకున్ననాని..

  • Written By:
  • Updated On - January 28, 2022 / 11:41 AM IST

మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయనలానే స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, టాలీవుడ్ లో సత్తా చాటుతోన్న హీరోల్లో నాని ఒకడు. నేచురల్ స్టార్ గా కూడా ఆయన ఎదిగాడు. కెరీర్ ఆరంభంలోనే అష్టాచమ్మ లాంటి భారీ విజయాన్ని అందుకున్ననాని.. అతి తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ కూడా రెట్టించిన ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే, ఈ మధ్య ‘జెర్సీ’ సినిమా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మాత్రం నానికి దక్కలేదనే చెప్పాలి. దీంతో బిగ్ హిట్ కొట్టేందుకు వరుస సినిమాలతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. పక్కా బ్లాక్ బస్టర్ కొట్టాలన్న ప్రయత్నంలో ఉన్న నాని… ఇటీవలె ‘శ్యామ్ సింగ రాయ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడిది అలాంటి ఇలాంటి రికార్డ్ కాదు… ఏకంగా ప్రపంచ రికార్డునే నమోదు చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

‘శ్యామ్ సింగరాయ్‌’ గా మెప్పించిన నాని..

నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘శ్యామ్ సింగ రాయ్’. దీన్ని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ అద్భుత సంగీతాన్ని అందించాడు. ఇందులో నేచురల్ స్టార్ నాని డ్యుయల్ రోల్ చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలించింది.

నిర్మాతలకు కాసుల పంట…

హీరో నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా అంచనాలకు అనుగుణంగానే వరల్డ్ వైడ్ గా రూ. 22 కోట్లు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ మూవీ ముగింపు సమయానికి రూ. 26.50 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4 కోట్లు లాభాలను అందుకుని సత్తా చాటుకుంది.

నెట్ ఫ్లిక్స్ లో అద్భుత రెస్పాన్స్..

నాని-సాయి పల్లవి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాకి థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన దక్కింది. అదే సమయంలో జనవరి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైంది. ఇక, థియేటర్లలో మాదిరిగానే… ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ ‘శ్యామ్ సింగరాయ్’ కి అద్భుత స్పందనే వచ్చింది. ఫలితంగా ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల జాబితాలో ఈ సినిమా చేరింది.

ఇండియాలో నెం.1 ప్లేస్ సొంతం చేసుకున్న ‘శ్యామ్ సింగరాయ్’..

నేచురల్ స్టార్ నాని సినమా ‘శ్యామ్ సింగ రాయ్’ కి నెట్‌ఫ్లిక్స్‌లో ఊహించని దాని కంటే ఎక్కవ స్పందనే సొంతమైంది. ఫలితంగా ఇది స్ట్రీమింగ్ లో ఫస్ట్ వీక్ లో ఎక్కువ మంది వీక్షించిన మొట్టమొదటి ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా తర్వాత మరోసారి సత్తా చాటిన టాలీవుడ్ ఫిల్మ్ గా పేరు సంపాదించుకుంది.

వరల్డ్ వైడ్ గా థర్డ్ ప్లేస్ లో
‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ…

ఇండియాలో నెం.1 స్థానాన్ని దక్కించుకున్న ‘శ్యామ్ సింగరాయ్’… లేటెస్ట్ గా ఓ రేర్ ఫీట్ ను అందుకుంది. ప్రపంచంలోనే ఇంగ్లీష్ సినిమాలను మినహాయిస్తే… ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల జాబితాలో ఇది మూడో స్థానంలో నిలిచింది. తద్వారా భారత్ నుంచి ఈ లిస్ట్ లో చేరిన మొట్ట మొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇంకా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లో కూడా ఈ సినిమా దూసుకెళుతోంది. దీంతో ఈ అరుదైన ఫీట్‌ను ‘శ్యామ్ సింగరాయ్’ అందుకోవడంతో.. నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.