Site icon HashtagU Telugu

ఈ బాలనటిని గుర్తు పట్టారా.. ఎంతగా మారిపోయింది..!

Shweta Basu Prasad

Shweta Basu Prasad

సినీ ప్రపంచంలో చిన్న వయసులోనే అడుగుపెట్టి, బాలనటిగా జాతీయ పురస్కారం అందుకున్న శ్వేతా బసు ప్రసాద్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తన కొత్త అవతారంతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన “ఫోటో డంప్” పోస్ట్, ఆమె అల్ట్రా స్టైలిష్‌ లుక్స్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

చాలా చిన్న వయసులోనే శ్వేతా తన కెరీర్‌ను ప్రారంభించారు. ‘మక్డీ’, ‘ఇక్బాల్’ వంటి సినిమాలతో ఆమె బాలతారగా విశేష గుర్తింపు పొందారు. తెలుగులోనూ కొత్తబంగారు లోకం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు టీవీ షోలలో, వివిధ భాషా చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే, 2014లో ఆమె జీవితంలో ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒక వివాదంలో ఆమె పేరు అనవసరంగా ఇరుక్కుని, ఆమె ప్రతిష్టకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ తర్వాత ఆమెపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని తేలింది. అన్ని ఆరోపణల నుంచి ఆమె నిర్దోషిగా బయటపడినప్పటికీ, ఆమె కెరీర్‌కు జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.

అన్ని కష్టాలు, సవాళ్లు ఎదురైనా శ్వేతా బసు ప్రసాద్ ఎక్కడా నిరాశపడలేదు. నటనా రంగానికి దూరంగా, ఆమె తన దృష్టిని రచన, డాక్యుమెంటరీల దర్శకత్వం వంటి కొత్త మార్గాల వైపు మళ్లించారు. నటనతో పాటు, తన జీవితాన్ని మరింత అర్ధవంతంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. నిర్మాత రోహిత్ మిట్టల్‌ను వివాహం చేసుకున్నప్పటికీ, ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు.

ఇప్పుడు 34 ఏళ్ల వయసులో, శ్వేతా బసు ప్రసాద్ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. తన సొంత శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఆమె ఈ ఫోటోలలో స్పష్టంగా ప్రతిబింబిస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, వాటిని తట్టుకుని నిలబడి, తనకంటూ ఒక మార్గాన్ని నిర్మించుకున్న శ్వేతా ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. ఆమె కెరీర్‌లో ఈ కొత్త మలుపు.. ఆమె తదుపరి ప్రయాణానికి ఒక బలమైన పునాదిగా నిలుస్తుందని ఆశిద్దాం.

Kannappa : కన్నప్ప ట్రైలర్‌ వచ్చేసింది..