Shruti Haasan : శృతి హాసన్ సంచలన నిర్ణయం..షాక్ లో ఫ్యాన్స్ , నెటిజన్లు

Shruti Haasan : ప్రస్తుతం యావత్ ప్రపంచం సోషల్ మీడియా తో గడుపుతూనే..శృతి మాత్రం సోషల్ మీడియా నుంచి తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది

Published By: HashtagU Telugu Desk
Sruthi

Sruthi

ప్రముఖ నటి శ్రుతి హాసన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం యావత్ ప్రపంచం సోషల్ మీడియా తో గడుపుతూనే..శృతి మాత్రం సోషల్ మీడియా నుంచి తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. నిత్యం ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వేదికలపై యాక్టివ్‌గా ఉండే శ్రుతి, తన ఫోటోలు, సినిమాల అప్డేట్లు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉండేది. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో “కొన్ని రోజులు నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా” అంటూ ఆమె పేర్కొంది.

Lucky Number: మీ అదృష్ట సంఖ్య ఎంతో మీకు తెలుసా? తెలియ‌కుంటే మీరే కనుక్కోవ‌చ్చు ఇలా!

శ్రుతి హాసన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఆమె అకౌంట్ హ్యాక్ కావడమేనని భావిస్తున్నారు. ఇటీవల ఆమె ‘X’ (పూర్వపు ట్విట్టర్) ఖాతా హ్యాక్ అయ్యింది. అకౌంట్ నుంచి క్రిప్టో కరెన్సీ, మీమ్ కాయిన్స్‌కు సంబంధించిన అనుమానాస్పద ట్వీట్లు కనిపించాయి. వెంటనే స్పందించిన శ్రుతి, తన ఖాతా హ్యాకయ్యిందని తెలియజేసి, ఎవ్వరూ ఆ లింక్స్‌పై క్లిక్ చేయవద్దని కోరారు. గతంలోనూ ఆమెకు ఇలాంటి హ్యాకింగ్ సమస్యలు ఎదురవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కొంతకాలం సామాజిక మాధ్యమాల నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Bharat Bandh Effect : ఈ రంగాలపై తీవ్ర ప్రభావం

సినిమాల విషయానికి వస్తే.. శ్రుతి హాసన్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ చిత్రంలో నటిస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్, శ్రుతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ స్పెషల్ రోల్ చేయనుండగా, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 14న ఐమ్యాక్స్ ఫార్మాట్‌తో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.

  Last Updated: 09 Jul 2025, 07:36 AM IST