కమల్ హాసన్ వారసురాలిగా శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటుతుంది. తెలుగు, తమిళ భాషల్లో అమ్మడు తన స్టార్ డం కొనసాగిస్తుంది. మధ్యలో కొన్నాళ్లు దూకుడు తగ్గించిందని అనిపించినా మళ్లీ అమ్మడు కెరీర్ ఊపందుకుంది. లాస్ట్ ఇయర్ ప్రభాస్ సలార్ 1 (Prabhas Salaar)తో మరో సూపర్ హిట్ అందుకుంది శృతి హాసన్. సినిమాలో ఆమె స్క్రీన్ టైం కాస్త తక్కువ అయ్యిందన్న ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ శృతి హాసన్ దాకా చేరాయి అనుకుంటా అందుకే కథానాయికల పాత్ర నిడివి మీద తన కామెంట్ చెప్పింది అమ్మడు.
కమర్షియల్ సినిమాకు ఏది కావాలన్నది దర్శక నిర్మాతలు నిర్ణయిస్తారు. సినిమాకు ఏది అవసరం అనుకుంటే అది ఉంచుతారు. అనవసరం అనుకున్నది కట్ చేస్తారు. అలానే అలాంటి సినిమాల్లో హీరోయిన్ పాత్ర కూడా అవసరానికి తగినట్టు ఉంచుతారని అంతకు మించి ఆశిస్తే బాగోదని అంటుంది అమ్మడు. తను నటించిన సినిమాల్లో ఎక్కువ స్క్రీన్ టైం ఉన్న సినిమాలు ఫ్లాప్ అవ్వగా.. తక్కువ స్క్రీన్ టైం ఉన్న సినిమాలు హిట్ అయ్యాయి. మనం ఎంత సేపు కంపించాం అన్నది కాదు ఎంత ఇంపాక్ట్ కలిగించాం అన్నది ముఖ్యం అంటుంది శృతి హాసన్ (Shruthi Hassan).
సలార్ 1 లో తన పాత్ర నిడివి తక్కువ ఉందని కామెంట్ చేశారు. ఐతే ఆ సినిమాపై తనకెలాంటి ఇబ్బంది లేదని అన్నది శృతి హాసన్. అంతేకాదు ఒక మంచి డిష్ అదే వంటకం తయారు చేయాలంటే అన్ని సమానంగా కుదరాలి ఏది ఎక్కువ తక్కువ అవ్వకూడదని చెప్పింది. సో సినిమాకు కూడా ఏది అవసరం అన్నది మేకర్స్ డిసైడ్ చేస్తారు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదంటుంది అమ్మడు.
శృతి హాసన్ ప్రస్తుతం సూపర్ స్టార్ (Super Star) రజినీతో కూలీ సినిమాలో నటిస్తుంది. దానితో పాటుగా తెలుగులో అడివి శేష్ తో డెకాయిట్ సినిమాలో జత కడుతుంది. ఈ రెండు సినిమాల మీద చాలా హోప్స్ పెట్టుకుంది అమ్మడు.
Also Read : BiggBoss : వేణు స్వామికి షాక్ ఇచ్చిన బిగ్ బాస్ టీం..!