Site icon HashtagU Telugu

Shruthi Hassan : శృతి హాసన్ డిమాండ్ అలా ఉంది.. ఆ సినిమా కోసం భారీగా డిమాండ్ చేస్తున్న అమ్మడు..!

Shruti Hassan Shocking Comments on Marriage

Shruti Hassan Shocking Comments on Marriage

Shruthi Hassan కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తెలుగులో కూడా తన సత్తా చాటుతుంది. ఈమధ్య సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన శృతి హాసన్ తిరిగి వరుస ఛాన్సులతో అదరగొట్టేస్తుంది. మొన్నటిదాకా తన బోయ్ ఫ్రెండ్ శాంతానుతో కలిసి సోషల్ మీడియాలో సందడి చేసిన శృతి అతనికి దూరమైందని తెలుస్తుంది. ఈ టైం లో తన ఫోకస్ అంతా కూడా సినిమాల మీద పెట్టాలని చూస్తుంది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న శృతి హాసన్ తెలుగులో అడివి శేష్ తో డెకాయిట్ సినిమా చేస్తుంది.

ఈ సినిమాలో నటించేందుకు శృతి హాసన్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తుంది. మాములుగా అయితే సినిమాకు 2 కోట్ల దాకా ఛారంజ్ చేస్తున్న శృతి హాసన్ డెకాయిట్ సినిమాకు మరో కోటి ఎక్స్ ట్రా అడిగిందట. సినిమాలో హీరోయిన్ పాత్ర శృతి హాసన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని ఆమె అడిగినంత ఇచ్చి మేకర్స్ శృతిని ఫిక్స్ చేశారట.

అడివి శేష్ ఓపక్క గూఢచారి 2 సినిమాను చేస్తూ మరోపక్క డెకాయిట్ చేస్తున్నాడు. డెకాయిట్ సినిమా యాక్షన్ విత్ క్రేజీ లవ్ స్టోరీగా రాబోతుందని తెలుస్తుంది. శృతి హాసన్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లో కూడా కనిపిస్తుందని అంటున్నారు. మొత్తానికి కెరీర్ దాదాపు ముగిసింది అనుకునే టైం లో శృతి హాసన్ వరుస క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ అలరిస్తుంది.

చేస్తున్న సినిమాల్లో ఏది సక్సెస్ అయినా శృతి హాసన్ కు మళ్లీ వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో కూడా శృతి ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది.

Also Read : Janhvi Kapoor : జాన్వికి అలాంటి వాడు భర్తగా కావాలట.. దేవర బ్యూటీ కోరికలు బాగానే ఉన్నాయ్..!