Shree Rapaka: పెళ్లికి ముందు సెక్స్ చేయడం తప్పు కాదు.. బోల్డ్ బ్యూటీ శ్రీరాపాక

వివాహానికి ముందు సెక్స్ చేయడం తప్పు కాదని దానికి కారణాలు కూడా ఉన్నాయని చెప్పింది.

  • Written By:
  • Updated On - August 11, 2023 / 03:33 PM IST

‘‘వివాహానికి ముందు సెక్స్ చేయడం తప్పు కాదు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. వివాహం చేసుకున్నాక అతడు మగాడు కాదని తెలిస్తే జీవితాంతం బాధపడాలి, అతను గే కూడా కావొచ్చు’’ ఈ మాటలు అంటున్న ఎవరో కాదు.. వర్మ హీరోయిన్ గా ముద్ర పడిపోయిన నటి శ్రీ రాపాక. వర్మ డైరెక్షన్లో నగ్నం అనే సినిమాలో నటించి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేయడం జరిగింది ఈ విషయాలు మరింత వైరల్ గా మారుతున్నాయి.

వివాహానికి ముందు సెక్స్ చేయడం తప్పు కాదని దానికి కారణాలు కూడా ఉన్నాయని చెప్పింది. వివాహం చేసుకున్నాక అతడు మగాడు కాదని తెలిస్తే జీవితాంతం బాధపడాలి అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. అలాగే తన జీవితంలో తన ఫ్రెండుకు జరిగిన ఒక సంఘటన గురించి తెలియజేసింది.. ఆమె మాట్లాడుతూ తన ఫ్రెండ్ ఒక డాక్టర్ని వివాహం చేసుకున్నదని అయితే మొదటి రోజే భర్త గే అని తెలిసింది.. దాంతో తన స్నేహితురాలు చాలా బాధపడిందని ఒక డాక్టర్ కే అలా జరిగితే ఇక మరి పరిస్థితి ఎలా అని ఆలోచించింది. అందుకే పెళ్లికి ముందే సెక్స్ చేస్తే అతను మగాడు కాదా తెలుస్తుందని తన దృష్టిలో సెక్స్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం అది ఇవ్వలేని వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవడమే కరెక్ట్ అని బోల్డ్ గా మాట్లాడింది శ్రీ రాపాక.

ప్రస్తుతం శ్రీ రాపాక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే శ్రీ రాపాక కామెంట్స్ కు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమెకు అవకాశాలు లేకపోవడమే అందుకు కారణమని కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా ఆర్జీవీ హీరోయిన్ కదా.. ఇలాగే మాట్లాడుతుందిలే అంటూ రియాక్ట్ అవుతున్నారు. ఈ బ్యూటీ గతంలోనూ ఇలాంటి కామెంట్స్ చేసింది. కానీ పై వ్యాఖ్యలు ఎప్పుడు చేసిందో ఏమో కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ పెళ్లి చేసుకున్నతర్వాతనే తాను పెళ్లి చేసుకుంటానని గతంలో ఓపెన్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది.

Also Read: Sonu Sood: మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్, బీహార్‌ వృద్ధుడికి 12 లక్షల సాయం