Site icon HashtagU Telugu

Shraddha Kapoor : ఏకంగా నాలుగు కోట్లు పెట్టి కార్ కొన్న బాలీవుడ్ భామ..

Shraddha Kapoor buys a costly Lamborghini car worth four crores

Shraddha Kapoor buys a costly Lamborghini car worth four crores

బాలీవుడ్(Bollywood) భామ శ్రద్దా కపూర్(Shraddha Kapoor) ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఏకంగా నాలుగు కోట్లు పెట్టి కార్ కొని బి టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్(Shakti Kapoor) కూతురిగా తీన్ పత్తి అనే సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రద్దా కపూర్. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సోషల్ మీడియాలో కూడా అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మన తెలుగులో ప్రభాస్ సరసన సాహూ సినిమాలో నటించింది.

తాజాగా శ్రద్దా కపూర్ అత్యంత ఖరీదైన కార్లు అమ్మే సంస్థ లంబోర్గిని(Lamborghini) కార్ కొనుగోలు చేసింది. లంబోర్గినిలో ఇటీవల వచ్చిన హురాకాన్ టెక్నికా అనే మోడల్ కారుని శ్రద్దా కొనుక్కుంది. అయితే కారు కాస్ట్ 4 కోట్ల 30 లక్షల వరకు ఉందని సమాచారం. దీంతో ఒక్క కారుకి ఏకంగా నాలుగు కోట్లు పెట్టిందా అని అందరూ చర్చించుకుంటున్నారు.

ముంబైలో లంబోర్గిని కార్లు అమ్మే పూజా చౌదరి ఈ విషయాన్నీ తెలియచేసింది. నా ఫ్రెండ్ శ్రద్దా కపూర్ కి లంబోర్గిని కార్ అమ్ముతున్నాను. తనని మహిళలు స్ఫూర్తిగా తీసుకొని తాము అనుకున్నవి నెరవేరాలి అని కోరుకుంటున్నాను అంటూ శ్రద్దా కపూర్, లంబోర్గిని కార్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. కానీ ఒక లేడీ సెలబ్రిటీ లంబోర్గిని కార్ కొనడం మన ఇండియాలో అయితే ఇదే మొదటిసారి.

Also Read : Ravi Teja: టైగర్ నాగేశ్వర్ రావు ఎఫెక్ట్, సంక్రాంతి బరి నుంచి రవితేజ ఔట్