Site icon HashtagU Telugu

Tollywood : టాలీవుడ్ కు ఊపిరి పోసిన చిన్న చిత్రాలు

Little Hearts , Mirai Movie

Little Hearts , Mirai Movie

వరుస ప్లాప్స్ తో ఇబ్బందుల్లో ఉన్న టాలీవుడ్ కు తాజాగా విడుదలై సూపర్ హిట్స్ అయినా చిన్న చిత్రాలు ఊపిరి పోశాయి. కథ లో దమ్ముంటే ప్రేక్షకులు థియేటర్స్ కు పరుగులు పెడతారని లిటిల్ హార్ట్స్ , మిరాయ్ చిత్రాలు నిరూపించాయి.

టాలీవుడ్ ఎప్పుడూ హిట్ సినిమాల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ అవ్వగానే మొత్తం ఇండస్ట్రీలో కొత్త ఉత్సాహం మొదలవుతుంది. హీరో, హీరోయిన్లు, దర్శకులు, టెక్నీషియన్లు అందరూ బిజీ అయిపోతారు. అడ్వాన్సులు అందుకుంటూ, కొత్త ప్రాజెక్టులు లైన్లోకి వస్తుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా విజయంతో ఇండస్ట్రీలో కొత్త ఊపు వచ్చింది. ఈ చిన్న సినిమా విజయం నిర్మాతలకు, కొత్తగా ప్రవేశిస్తున్న దర్శకులకు మంచి ఉత్సాహాన్ని కలిగించింది. చిన్న సినిమా విజయం సాధించిన వెంటనే వందలాది కొత్త నిర్మాతలు రంగంలోకి దిగుతారని చెప్పడం అతిశయోక్తి కాదు.

Hyderabad : ‘గేట్ ఆఫ్ వరల్డ్’ స్థాయికి హైదరాబాద్ ను తీసుకెళ్తామ్ – సీఎం రేవంత్

‘లిటిల్ హార్ట్స్’తో హీరోగా పరిచయం అయిన మౌళి ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌లో ఉన్నాడు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి వరుసగా నిర్మాతల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయని సమాచారం. దర్శకుడిగా పరిచయం అయిన సాయి మార్తాండ్ కూడా మంచి బ్రేక్ పొందాడు. సినిమా సెట్స్‌పైనే జగపతిబాబు అడ్వాన్స్ ఇచ్చారు. రిలీజ్ అయ్యాక మరో పెద్ద నిర్మాణ సంస్థతో పాటు బన్నీ వాస్ వంటి నిర్మాతలు కూడా అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. అలాగే సంగీత దర్శకుడిగా పరిచయమైన సింజిత్ కూడా నిర్మాతల దృష్టిని ఆకర్షించి బిజీ అవుతున్నాడు. అంటే, ఈ సినిమా కేవలం విజయమే కాకుండా, కొత్త టాలెంట్‌కు అవకాశాల వేదికగా మారింది.

ఇక మరోవైపు ‘మిరాయ్’ సినిమా హీరో తేజాకు విశేషమైన పాపులారిటీని తీసుకొచ్చింది. ప్రస్తుతం అతను ‘జాంబీరెడ్డి 2’లో నటించబోతున్నాడు. బాలీవుడ్ నుంచి కూడా అతనికి ఓపెన్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. అలాగే మంచు మనోజ్ విలన్‌గా మళ్లీ బిజీ అవ్వబోతున్నాడు. అలాగే ‘కిష్కింధపురి’ సాధారణ విజయమే సాధించినప్పటికీ, దర్శకుడు కౌశిక్‌కు మరో అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. విలన్‌గా నటించిన శాండీ మాస్టర్, అలాగే ‘కోర్ట్’ సినిమా టీమ్ కూడా కొత్త ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. రోషన్, శ్రీదేవి వంటి నటులతో కోన వెంకట్ ‘బ్యాండ్ మేళం’ను ప్రారంభించగా, రోషన్ చేతిలో నాలుగు సినిమాలు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఈ పరిణామాలు టాలీవుడ్‌లో కొత్త టాలెంట్‌కు ఎంతగానో అవకాశాలు వస్తున్నాయని స్పష్టం చేస్తున్నాయి.