Site icon HashtagU Telugu

Rashmika Dating: విజయ్ దేవరకొండకు షాక్.. బెల్లంకొండతో రష్మిక డేటింగ్?

Rashmika And Bellamkonda

Rashmika And Bellamkonda

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తున్నట్టు, బీచ్ లు, పార్టీల్లో ఏకాంతంగా గడుపుతున్నట్టు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఈ జంట పలు సందర్భాల్లో మీడియాకు చిక్కడంతో డేటింగ్ లో ఉన్నట్టు స్పష్టమైంది కూడా. అయితే డేటింగ్ విషయమై ఇప్పటివరకు ఈ జంట ఎక్కడా కూడా మాట్లాడలేదు. కేవలం తాము స్నేహితులం మాత్రమే అని రియాక్ట్ అయ్యారు.

అయితే తాజాగా రష్మిక మందన్న విజయ్ దేవరకొండకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల ఈ జంట ముంబై ఎయిర్ పోర్ట్ లో ఒక్కటిగా కనిపించడం, క్లోజ్ గా మూవ్ కావడంతో డేటింగ్ లో ఉన్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే తమ రిలేషన్ పై అటు రష్మిక, ఇటు బెల్లంకొండ స్పందించలేదు. కానీ రష్మిక మాత్రం ఒక ఇంటర్వ్యూలో విజయ్‌తో చాలా సన్నిహితంగా చెప్పింది.

ఏది ఏమైనప్పటికీ, రష్మిక బెల్లంకొండతో కనిపించడంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ అప్ సెట్ అయ్యారు. రష్మిక విజయ్‌తో డేటింగ్ చేస్తుందా లేదా శ్రీనివాస్‌తో డేటింగ్ చేస్తుందా? అని చర్చించుకుంటున్నారు. విజయ్‌తో నేషనల్ క్రష్ విడిపోయిందనే పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం రష్మిక యానిమల్ అనే బాలీవుడ్ మూవీ చేస్తుండగా, బెల్లకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Also Read: Janhvi Kapoor: భాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుమలను దర్శించుకున్న జాన్వీ.. ఫొటో వైరల్