రామ్ చరణ్, బుచ్చిబాబు (Ram Charan – Buchhibabu) సన కాంబినేషన్‌లో రూపొందనున్న RC16 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సన తన మొదటి చిత్రం ఉప్పెనతోనే ప్రేక్షకులను మెప్పించి, ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని దర్శకత్వ శైలి, భావోద్వేగాల ప్రదర్శన ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమా కోసం బుచ్చిబాబు భారీ క్యాస్ట్ & క్రూ ను రంగంలోకి దింపుతున్నట్లు వినికిడి.
Roja : మాజీ మంత్రి రోజా పై మంత్రి దుర్గేశ్ ఫైర్
ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌ను కీలక పాత్ర కోసం సంప్రదించారని, ఆయన కథ వినిపించగానే ఓకే చెప్పినట్లు సమాచారం. జాన్వీ కపూర్ కథానాయికగా నటించబోతుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar) ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు.
ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన మేకర్స్…హైదరాబాద్ శివారు ప్రాంతంలో తదుపరి షెడ్యూల్‌కి సంబంధించిన సెట్ వర్క్ జరుగుతోంది. అనుకున్నదాని కంటే వారం రోజులు ముందుగానే సెట్ వర్క్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దాంతో ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కావాల్సిన కొత్త షెడ్యూల్‌ను వారం ముందుగానే అంటే జనవరి చివరి వారంలో ప్రారంభించాలని నిర్ణయించారు.