Bigg Boss Season 8 : బిగ్ బాస్ ని వదలని శివాజి.. సీజన్ 8లో కూడా..?

Bigg Boss Season 8 బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అవ్వడంతో సీజన్ 8 ఎప్పుడు మొదలవుతుందా అని ఆడియన్స్ అంతా ఆసక్తితో ఉన్నారు. సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ

Published By: HashtagU Telugu Desk
Shivaji Host For Bigg Boss Season 8 Bigg Boss Buzz

Shivaji Host For Bigg Boss Season 8 Bigg Boss Buzz

Bigg Boss Season 8 బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అవ్వడంతో సీజన్ 8 ఎప్పుడు మొదలవుతుందా అని ఆడియన్స్ అంతా ఆసక్తితో ఉన్నారు. సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ లవర్స్ ని మెప్పించిన ఆ సీజన్ కొత్త సీజన్ ని మరింత కొత్తగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 కి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా చేస్తాడని తెలుస్తుంది. సీజన్ 8 ని ఆగష్టులో మొదలు పెట్టేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 8 లో సీజన్ 7 కంటెస్టెంట్ శివాజి కూడా ఉంటాడని లేటెస్ట్ టాక్. అదేంటి సీజన్ 7 కంటెస్టెంట్ ఎలా ఉంటాడని అనుకోవచ్చు. శివాజి వచ్చేది హౌస్ మెట్ గా కాదు.. హోస్ట్ గా అని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ 3 గా నిలిచిన శివాజిని బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా తీసుకున్నారట.

లాస్ట్ సీజన్ కు గీతు రాయల్ బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా చేసింది. ఇప్పుడు ఆమె ప్లేస్ లో శివాజి వస్తారని తెలుస్తుంది. మామూలుగానే తన తెలివి తేటలతో ఎదుటివారిని తికమక పెట్టే శివాజి బిగ్ బాస్ సీజన్ 8 బజ్ హోస్ట్ గా అంటే ఆ ఇంటర్వ్యూలు కూడా ఆసక్తికరంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇందుకోసం శివాజి భారీ రెమ్యునరేషన్ పొందుతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Prabhas Kalki Promotions : కల్కి పేరు దేశం మొత్తం మారుమోగేలా.. నాగ్ అశ్విన్ ప్రమోషనల్ ప్లాన్ అదుర్స్..!

  Last Updated: 14 Jun 2024, 12:27 PM IST