Site icon HashtagU Telugu

Shilpa Shetty : బాంబే హైకోర్టును ఆశ్రయించిన శిల్పాశెట్టి దంపతులు

Shilpa Shetty couple approached the Bombay High Court

Shilpa Shetty couple approached the Bombay High Court

Money laundering case : మనీ లాండరింగ్‌ కేసులో నటి శిల్పాశెట్టి , ఆమె భర్త రాజ్‌ కుంద్రా తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మనీ లాండరింగ్‌ కేసులో భాగంగా తాము ఉంటున్న ఇల్లు, ఫామ్‌ హౌస్‌ను వెంటనే ఖాళీ చేయాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ కేసుకు, తమ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై అక్టోబర్‌ 10వ తేదీన విచారణ జరగనుంది.

Read Also: Aam Aadmi Party : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ : ఆమ్ ఆద్మీ పార్టీ

ముంబయికి చెందిన ‘వేరియబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థ 2017లో ‘గెయిన్‌ బిట్‌కాయిన్‌ పోంజీ స్కీమ్‌’ను నిర్వహించింది. ఇందులో భాగంగా బిట్‌కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ-లెవల్‌ మార్కెటింగ్‌ (MLM) పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబయి, దిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ.6,600 కోట్లు వసూలు చేశారు. ఈ మోసం బయటపడటంతో సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఈ స్కామ్‌లో మాస్టర్‌మైండ్‌ అయిన అమిత్ భరద్వాజ్‌ నుంచి రాజ్‌ కుంద్రా 285 బిట్‌కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. వీటితో ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని రాజ్‌కుంద్రా ప్రణాళికలు వేసినట్లు తెలిపింది. ఈ కాయిన్లు ఇప్పటికీ అతడి వద్ద ఉన్నాయని, ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం వాటి విలువ రూ.150 కోట్లకు పైనే ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా రాజ్‌కుంద్రా ఆస్తులను అటాచ్‌ చేసింది.

Read Also: T.P. Madhavan : చిత్రసీమలో మరో విషాదం – ప్రముఖ నటుడు కన్నుమూత