Site icon HashtagU Telugu

Sonakshi Weds Zaheer : సోనాక్షితో జహీర్ పెళ్లి.. శత్రుఘ్న సిన్హా రియాక్షన్ ఇదీ

Sonakshi Weds Zaheer

Sonakshi Weds Zaheer

Sonakshi Weds Zaheer : ప్రఖ్యాత నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె 37 ఏళ్ల హీరోయిన్ సోనాక్షి సిన్హా.. 35 ఏళ్ల యువ నటుడు జహీర్ ఇక్బాల్‌‌ను పెళ్లాడబోతోందనే వార్తలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  జూన్ 23న ముంబైలో వీరి పెళ్లి జరగబోతోందని అంటున్నారు. సోనాక్షి, జహీర్ పెళ్లి పత్రికను ఒక మ్యాగజైన్ కవర్‌లాగా డిజైన్ చేశారట. దానికి పైన క్యాప్షన్‌గా ‘పుకార్లు నిజమే’ అని పెట్టారట. ముంబైలోని ప్రముఖ వేడుకల వేదిక బాస్టియన్‌‌లో వీరి పెళ్లి జరుగుతుందని సమాచారం. అయితే ఈ మ్యారేజీ కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే పిలిచారట. ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో సోనాక్షి సిన్హా నటించారు. అందులో నటించిన వారందరినీ మ్యారేజీకి పిలిచారని తెలిసింది. ప్రస్తుతం ‘హీరామండి’ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.

We’re now on WhatsApp. Click to Join

జహీర్, సోనాక్షి పెళ్లి వ్యవహారంపై ఎట్టకేలకు శత్రుఘ్న సిన్హా తొలిసారిగా స్పందించారు. ఇటీవలే ఆయన మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీ నుంచి లోక్‌సభ ఎంపీగా గెలిచారు. ‘‘జహీర్, సోనాక్షి మాకు ఇంకా ఏమీ చెప్పలేదు. ఒకవేళ ఏదైనా చెబితే మేం వాళ్లిద్దరినీ ఆశీర్వదిస్తాం. జహీర్‌తో సోనాక్షి పెళ్లి గురించి మీకెంత తెలుసో.. నాకూ అంతే తెలుసు. మా కూతురి (సోనాక్షి) నిర్ణయాలను మేం గౌరవిస్తాం. మేజర్‌గా సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఆమెకు ఉంది’’ అని శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు.  తన కుమార్తె పెళ్లి జరిగితే బారాత్ ముందు డ్యాన్స్ చేయాలని ఉందన్నారు.

సోనాక్షి, జహీర్ 2020 సంవత్సరం నుంచి డేటింగ్ చేస్తున్నారు. వాళ్లిద్దరు కలిసి 2022 సంవత్సరంలో ‘డబుల్ ఎక్స్‌ఎల్‌’ సినిమాలో  నటించారు. గత సంవత్సరం వీళ్లిద్దరూ ‘బ్లాక్‌బస్టర్’ అనే మ్యూజిక్ వీడియోలోనూ కనిపించారు . జహీర్, సోనాక్షి(Sonakshi Weds Zaheer) తరచుగా ముంబైలోని వివిధ ఈవెంట్‌లలో, డిన్నర్ ఔటింగ్‌లలో కలిసి కనిపిస్తుంటారు. జహీర్‌ కుటుంబం మొదటి నుంచీ సల్మాన్ ఖాన్ కుటుంబానికి చాలా క్లోజ్. జహీర్‌ను సోనాక్షికి పరిచయం చేసిందే సల్మాన్ ఖాన్ అని అంటారు.