Sharwanand : తండ్రి పోస్ట్ కొట్టేసిన శర్వానంద్ ..

ఇటీవల వరుసపెట్టిన యంగ్ హీరోలంతా తండ్రి పోస్టులు కొట్టేస్తున్నారు. రీసెంట్ గా నిఖిల్ తండ్రైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో హీరో కూడా తండ్రి పోస్ట్ కొట్టేసాడు. ఆయనే గమ్యం ఫేమ్ శర్వానంద్ (Sharwanand ). గత ఏడాది శర్వా.. పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. జూన్ 3 న రక్షితా రెడ్డి (Rakshitha Reddy) ని వివాహం చేసుకున్నాడు. ఇక గత కొద్దీ రోజులుగా శర్వానంద్ తండ్రి కాబోతున్నాడని, రక్షిత ప్రస్తుతం గర్భవతి […]

Published By: HashtagU Telugu Desk
Sharwanand And His Wife Wel

Sharwanand And His Wife Wel

ఇటీవల వరుసపెట్టిన యంగ్ హీరోలంతా తండ్రి పోస్టులు కొట్టేస్తున్నారు. రీసెంట్ గా నిఖిల్ తండ్రైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో హీరో కూడా తండ్రి పోస్ట్ కొట్టేసాడు. ఆయనే గమ్యం ఫేమ్ శర్వానంద్ (Sharwanand ). గత ఏడాది శర్వా.. పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. జూన్ 3 న రక్షితా రెడ్డి (Rakshitha Reddy) ని వివాహం చేసుకున్నాడు. ఇక గత కొద్దీ రోజులుగా శర్వానంద్ తండ్రి కాబోతున్నాడని, రక్షిత ప్రస్తుతం గర్భవతి అంటూ వార్తలు వినిపించగా.. ఇక ఇప్పుడు అదే నిజం అయ్యింది. నేడు తన పుట్టినరోజున తాను తండ్రి అయ్యినట్లు అధికారికంగా చెప్పుకొచ్చాడు. రక్షిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని చెప్పుకొచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక కూతురు పేరు లీలా దేవి మైనేని (Leela Devi Myneni) అంటూ ప్రకటించాడు. దీంతో పాటు శర్వా, రక్షిత.. లీలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడం తో అభిమానులు , సినీ ప్రముఖులు శర్వా కు విషెష్ చెప్పుకొస్తున్నారు. ఇక శర్వా షేర్ చేసిన పిక్ లో వైట్ డ్రెస్ లో శర్వా దంపతులు.. చిన్నారి ఎంతో చుడముచ్చటిగా ఉండడం తో అంత షేర్ చేస్తున్నారు. ఇక శర్వా సినిమాల విషయానికి గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతూ వస్తున్నారు.

శర్వానంద్ రెండేళ్ల క్రిందట ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన 35వ చిత్రాన్ని అనౌన్స్ చేసారు. అయితే మధ్యలో శర్వా తన ఎంగేజ్మెంట్, మ్యారేజ్ పనుల్లో పడడంతో.. ఆ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ ని ఈరోజు శర్వా పుట్టిన రోజు సందర్బంగా రివీల్ చేసారు. ఈ చిత్రానికి ‘మనమే’ (Manamey ) అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇక ఈ టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ లో శర్వానంద్, హీరోయిన్ కృతిశెట్టి(KrithiShetty )ని, అలాగే ఒక చిన్న పాపని చూపించారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది.

Read Also : Banana Kheer : అరటిపండుతో పాయసం.. ఇలా చేస్తే టేస్ట్ సూపర్ అంతే..

  Last Updated: 06 Mar 2024, 08:30 PM IST