Ram Charan and Shankar: మేకింగ్ లో ‘శంకర్’ ట్రెండ్ సెట్.. ఒక్క పాటకు 15 కోట్లు ఖర్చు!

డైరెక్టర్ శంకర్ అనగానే భారీ సినిమాలు, భారీ సెట్టింగ్స్ లు కళ్ల ముందు కదలాడుతాయి. ఆయన ఏదీ చేసినా చాలా రిచ్ గా ఉంటుంది. అందుకే

  • Written By:
  • Updated On - November 17, 2022 / 02:34 PM IST

డైరెక్టర్ శంకర్ అనగానే భారీ సినిమాలు, భారీ సెట్టింగ్స్ లు కళ్ల ముందు కదలాడుతాయి. ఆయన ఏదీ చేసినా చాలా రిచ్ గా ఉంటుంది. అందుకే ఆయన తో సినిమా అంటేనే ఓ మోస్తారు నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ శంకర్ మాత్రంలో సినిమాలో భాగంగానే తాను భారీ సెట్టింగ్స్ కు ప్రయారిటీ ఇస్తానని తేల్చి చెప్పారు. అందుకే భారీతనం ఇతడి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం కూడా శంకర్ ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు.

సింగిల్ సాంగ్ కోసం ఏకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నాడు. రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఓ సాంగ్ ను న్యూజిలాండ్ లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ ఒక్క సాంగ్ కోసం అక్షరాలా 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందట. మేకింగ్ లో ట్రెండ్ సెట్ చేయడం శంకర్ స్టయిల్.

గతంలో బాయ్స్, భారతీయుడు, జీన్స్ లాంటి సినిమాలతో ఇలానే ట్రెండ్ సెట్ చేసిన శంకర్, ఇప్పుడీ కొత్త సినిమాతో కూడా ఓ సాంగ్ తో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు దిల్ రాజు నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై చరణ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ మూవీ రిలీజ్ తర్వాత తన రేంజ్ మారిపోతుందని భావిస్తున్నాడు.