Site icon HashtagU Telugu

Shamitha Shetty : ఇంకెప్పుడు ఏ అమ్మాయిని ఇలా అడగొద్దు.. కొంచమైనా పాజిటివ్ గా ఆలోచించాలి..!

Shamitha Shetty Attack On Netizen

Shamitha Shetty Attack On Netizen

Shamitha Shetty శిల్పా శెట్టి సోదరి షమిత శెట్టి బాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా సినిమాలు చేసింది. తెలుగులో ఆమె చేసిన పిలిస్తే పలుకుతా సినిమా మ్యూజిక్ ఆల్బం సూపర్ హిట్ కాగా ఇప్పటికీ ఆ సినిమాలో సాంగ్స్ అక్కడక్కడ వినిపిస్తాయి. బాలీవుడ్ లో కూడా అమ్మడు సినిమాలు చేసింది కానీ స్టార్ రేంజ్ అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది.

ఇక 2022 లో తేరే విచ్ రన్ డిస్దా మ్యూజిక్ వీడియోలో నటించిన షమితా శెట్టి 2023 లో ది టెనెంట్ సినిమాలో నటించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆమె వెండితెర మీద కనిపించారు. 2021 లో హిందీ బిగ్ బాస్ లో కూడా షమితా శెట్టి పాల్గొన్నారు. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే షమితా కి ఒక నెటిజెన్ పెట్టిన కామెంట్ ఆమెకు కోపం తెప్పించింది.

నీ జీవితంలో 50 సంవత్సరాలు వచ్చినా ఒక్క మగాడు లేకుండా ఎలా గడిచిపోయింది అంటూ ఒక నెటిజెన్లు ప్రశ్నించింది ఈ ప్రశ్నకు షమితా అదే రేంజ్ లో ఆన్సర్ ఇచ్చింది. జీవితంలో కొంచెం అయినా పాజిటివ్ గా ఆలోచించమని.. ఇలా ఇంకెప్పుడూ ఏ అమ్మాయిని అడిగి వారిని తక్కువ చేసి మాట్లాడొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇతరులకు మంచి చేయకపోయినా పర్లేదు కానీ మౌనంగా ఉంటే చాలని అలా ఉండమని షమితా శెట్టి ఆ నెటిజెన్ కి చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్నప్పుడు అక్కడ రాకేష్ ని ప్రేమించిన ఆమె తర్వాత ఇద్దరు విడిపోయారు.

Also Read : Kamal Hassan : సమ్మర్ లోనే రిలీజ్.. ఇండియన్ 2 పై లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే..?