Site icon HashtagU Telugu

Telugu Movies: కర్ణాటకలో తెలుగు సినిమాలకు అవమానం..!

Telugu Movies

Telugu Movies

Telugu Movies: కర్ణాటకలో తెలుగు సినిమాలకు (Telugu Movies) అవమానం జ‌రుగుతుంది. తెలుగు సినిమా పోస్టర్లను కన్నడిగులు చించి వేస్తున్నారు. తెలుగులో పోస్టర్లు ఉండడంతో చించి వేస్తున్నట్టు తెలుస్తోంది. పోస్టర్లుపై కన్నడ అని కన్నడిగులు రాస్తున్నారు. సంవత్సరం క్యాలెండర్ మారిన పర భాష సినిమా వాళ్ళ బుద్దులు మారలేదు అంటూ పోస్టర్లు అంటిస్తున్నారు. తెలుగు సినిమా పోస్టర్లపై నల్ల కలర్ పూస్తున్నారు. అంతేకాకుండా ర‌క‌ర‌కాల స్ప్రేలు ఉప‌యోగిస్తూ సినిమా పోస్ట‌ర్ల‌పై పిచ్చి రాత‌లు రాస్తున్నారు. ఇటీవ‌ల‌ గేమ్ ఛేంజ‌ర్ పోస్ట‌ర్ల‌పై ఇష్టానుసారంగా రాసిని క‌న్న‌డిగులు.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం పోస్టర్లు చించివేశారు.

అయితే ఇలా తెలుగు పోస్ట‌ర్ల‌పై క‌న్న‌డిగులు ఇష్టానుసారం రాస్తుండ‌టంతో స్థానికి హీరోల అభిమానులు, తెలుగు ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి చ‌ర్య‌లు జ‌ర‌గ‌కుండా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ పెద్ద‌లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలుగు అభిమానులు కోరుతున్నారు.

Also Read: CM Revanth: తెలుగువారి హ‌వా తగ్గింది.. సీఎం రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు

జ‌న‌వ‌రి 10న గేమ్ ఛేంజ‌ర్‌

రామ్ చ‌ర‌ణ్ హీరోగా త‌మిళ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. ఈ సినిమా జ‌న‌వ‌రి 10వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాల‌ను చిత్ర‌బృందం పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న అంజ‌లి, బాలీవుడ్ భామ కియ‌రా అద్వానీ యాక్ట్ చేయ‌గా.. ఎస్‌జే సూర్య‌, స‌ముద్ర‌ఖ‌ని, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర‌, సునీల్, అలీ, బ్ర‌హ్మానందం, త‌దిత‌ర న‌టులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

జ‌న‌వ‌రి 14న సంక్రాంతికి వ‌స్తున్నాం

సంక్రాంతి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న మ‌రో తెలుగు సినిమా సంక్రాంతికి వ‌స్తున్నాం. ఈ చిత్రంలో హీరో వెంక‌టేశ్ యాక్ట్ చేస్తుండ‌గా.. హీరోయిన్లుగా మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్‌, త‌దిత‌రులు న‌టించారు. ఈ మూవీ కూడా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మైంది. అయితే గేమ్ ఛేంజ‌ర్‌, సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు- శిరీష్ నిర్మించ‌టం గ‌మ‌నార్హం. అయితే రెండు సినిమాల‌తో పాటు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన డాకు మ‌హారాజ్ కూడా జ‌న‌వ‌రి 12వ తేదీన సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. ఈ మూవీకి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.