Shalini Pandey : “అర్జున్ రెడ్డి” సినిమాతో కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అందాల తార శాలిని పాండే, మరోసారి తన లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఆమె తాజాగా షేర్ చేసిన చిత్రాలు సొగసు, ఆకర్షణల అద్భుత సమ్మేళనంగా మారి, చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ పోస్టులకు ఆమె ఎంచుకున్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, చెట్ బేకర్ క్వార్టెట్ ‘ఐ ఫాల్ ఇన్ లవ్ టూ ఈజిలీ’, ఆ వాతావరణానికి మరింత క్లాసిక్, రొమాంటిక్ టచ్‌ను అందించి అభిమానుల మనసులను దోచుకుంటోంది.
Deputy CM Bhatti : విద్యుత్తు పై బీఆర్ఎస్ నేతలకు అవగాహన లేదు- డిప్యూటీ సీఎం భట్టి
శాలిని పాండే సినీ ప్రస్థానం 2017లో వచ్చిన “అర్జున్ రెడ్డి”తో ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ, జియా శర్మ, సంజయ్ స్వరూప్ వంటి నటులతో కలిసి ఆమె నటించిన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ సినిమా ఆమెను ప్రతిభావంతులైన నటిగా నిరూపించడమే కాకుండా, తన కుటుంబం తన సినీ కెరీర్‌ను అంగీకరించేలా చేసింది. “అర్జున్ రెడ్డి” తర్వాత శాలిని “మహానటి”, “గోరిల్లా”, “ఇద్దరి లోకం ఒకటే” వంటి చిత్రాలలో తన నటనతో ఆకట్టుకుంది. 2022లో విడుదలైన “జయేష్‌భాయ్ జోర్దార్” చిత్రంతో బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసింది. ఇటీవల జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్‌లతో కలిసి “మహారాజ్” సినిమాలో కనిపించి ప్రేక్షకులను అలరించింది.
అయితే, సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో షాలిని పాండే సోషల్ మీడియాలో తన హాట్ అప్పీల్‌ను పెంచుకుంటూ వస్తోంది. హాట్ హాట్ ఫోటోషూట్స్, బికినీ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ఆమె లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు, అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ఆమె అభిమానులు “నువ్వు అద్భుతం!”, “అందానికి కొత్త అర్థం చెప్పావు!” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. శాలిని అందం, ఆకర్షణలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
Sattenapalle : బారికేడ్లను నెట్టివేస్తూ పోలీసులతో గొడవకు దిగిన అంబటి