Jawan Collections : నాలుగు రోజుల్లో ఏకంగా 520 కోట్లు.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సునామీ..

జవాన్ సినిమా మొదటి రోజే 120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమాగా నిలిచింది.

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 08:59 PM IST

బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shahrukh Khan) సెప్టెంబర్ 7న జవాన్(Jawan) సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. సౌత్ లో మనకి తెలిసిన కథే అయినా నార్త్ వాళ్ళకి ఆ కథ, ఎలివేషన్స్ కొత్తగా ఉండటంతో సినిమాకి భారీ విజయం అందించారు. సినిమా రిలీజ్ రోజు నుంచే సూపర్ హిట్, పక్కా కమర్షియల్ సినిమా అని అంటున్నారు. ఇక జవాన్ సినిమాకి కలెక్షన్స్(Jawan Collections) కూడా ఓ రేంజ్ లో వస్తున్నాయి.

జవాన్ సినిమా మొదటి రోజే 120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమాగా నిలిచింది. వీకెండ్ ఉండటం, సినిమాలేవీ లేకపోవడంతో నాలుగు రోజుల్లో జవాన్ సినిమా ఏకంగా 520 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపోయింది. షారుఖ్ చాలా ఏళ్ళ తర్వాత ఇటీవల పఠాన్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు అనుకుంటే జవాన్ దానికి మించి హిట్ అయింది. నెక్స్ట్ వారం కూడా పెద్ద సినిమాలేవీ లేకపోవడం జవాన్ కి మరింత కలిసొస్తుంది. 1000 కోట్ల టార్గెట్ తో జవాన్ దూసుకుపోతుంది.

జవాన్ సినిమాని తమిళ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించగా ఇందులో నయనతార హీరోయిన్ గా నటించగా, ప్రియమణి, దీపికా పదుకొనే, సాన్య మల్హోత్రా ముఖ్య పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. జవాన్ సినిమాకు అనిరుద్ అందించిన సంగీతం మరింత ప్లస్ అయింది.

 

Also Read : Thalaivar 171 : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ సినిమా .. కాంబో అదిరిపోయిందిగా..