బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shahrukh Khan) ఇటీవల సెప్టెంబర్ 7న జవాన్(Jawan) సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. సౌత్ వాళ్లకి తెలిసిన పాత కమర్షియల్ కథకి సరికొత్త మాస్ హంగులు అద్ది నార్త్ వాళ్లకి షారుఖ్ తో ప్రజెంట్ చేశాడు అట్లీ. దీంతో జవాన్ సినిమా భారీ విజయం సాధించింది. సినిమా రిలీజ్ రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక జవాన్ సినిమాకి కలెక్షన్స్(Jawan Collections) కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి.
ఈ సంవత్సరం ఆరంభంలో షారుఖ్ పఠాన్ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టి ఏకంగా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. దీంతో జవాన్ సినిమా కూడా 1000 కోట్ల టార్గెట్ పెట్టుకుంది. జవాన్ సినిమా మొదటి రోజే 120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమాగా నిలిచింది. వీకెండ్ ఉండటం, సినిమాలేవీ లేకపోవడంతో నాలుగు రోజుల్లో జవాన్ సినిమా ఏకంగా 520 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపోయింది.
తాజాగా జవాన్ సినిమా రిలీజయి పది రోజులైంది. జవాన్ పదిరోజులకు గాను దాదాపు 800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. దీంతో టార్గెట్ కి ఇంకో 200 కోట్ల దూరంలో ఉంది అని అనుకుంటున్నారు. నేడు ఆదివారం, రేపు వినాయక చవితి కావడంతో ఈ సెలవుల్లో ఇంకో 100 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎలా అయినా 1000 కోట్ల టార్గెట్ మాత్రం రీచ్ అవ్వాల్సిందే అని జవాన్ చిత్రయూనిట్ భావిస్తుంది. అందుకే ఇటీవల ఓ సక్సెస్ మీట్ పెట్టి మరోసారి జనాల్లోకి వచ్చారు చిత్రయూనిట్.
Nothing much, just JAWAN on a record-breaking and making spree! 🔥
Have you watched it yet? Go book your tickets now – https://t.co/B5xelUahHO
Watch #Jawan in cinemas – in Hindi, Tamil & Telugu. pic.twitter.com/6k3SUzxD3O
— Red Chillies Entertainment (@RedChilliesEnt) September 17, 2023
ఇక జవాన్ సినిమాని తమిళ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించగా ఇందులో నయనతార హీరోయిన్ గా నటించగా, ప్రియమణి, దీపికా పదుకొనే, సాన్య మల్హోత్రా ముఖ్య పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. జవాన్ సినిమాకు అనిరుద్ అందించిన సంగీతం మరింత ప్లస్ అయింది.