Shahrukh Khan: షారుక్ బర్త్ డే సర్ ప్రైజ్, ఓటీటీలోకి వచ్చేస్తున్న జవాన్ మూవీ!

బాలీవుడ్ హీరో షారుక్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఆయన హిట్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

  • Written By:
  • Publish Date - October 7, 2023 / 01:21 PM IST

Shahrukh Khan: బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన షారుఖ్ ఖాన్-అట్లీ చిత్రం ‘జవాన్’ నవంబర్ 2 న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. కింగ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం OTT విడుదల చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. షారుఖ్ అభిమానులను పూర్తిగా ఆకట్టుకున్న మాస్ ఎంటర్‌టైనర్ జవాన్. ఆజాద్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కింగ్ ఖాన్ ఏడు విభిన్నమైన గెటప్ లలో కనిపిస్తాడు. లాస్ట్ పార్ట్ లో ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ కూడా గెస్ట్ స్టార్ గా వస్తాడు.

విజయ్ సేతుపతి ఆయుధాల స్మగ్లర్‌గా కాళీ గైక్వాడ్‌గా నటించగా, నయనతార నర్మదా రాయ్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. ఐశ్వర్య రాథోడ్ పాత్రలో దీపికా పాత్ర కూడా ప్రశంసలు అందుకుంటుంది. అనిరుద్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు అసెట్. రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. క్యామియో రోల్‌లో వచ్చిన దీపికా పదుకొణె తన క్యారెక్టర్‌ని ఆకట్టుకునేలా చేసింది. ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా, రిద్ధి డోగ్రా, లెహర్ ఖాన్, సంజీతా భట్టాచార్య తదితరులు ఈ చిత్రంలో ప్రధాన నటీనటులు.

కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన యాక్షన్ మూవీనే ‘జవాన్’. ఈ మూవీకి ఓవర్సీస్‌లో వేసిన ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అదే ఇండియాలోనూ కంటిన్యూ అవడంతో ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే దక్కుతోంది. ఇలా ఈ చిత్రం ఇప్పటి వరకూ 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్‌ను వసూలు చేసి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. అలాగే, రూ. 600 కోట్లు పైగా నెట్ వసూళ్లను కూడా అందుకుంది. దీంతో ఈ మైలురాళ్లను చేరిన ఏకైక హిందీ చిత్రంగా చరిత్రను సృష్టించింది.