Site icon HashtagU Telugu

Aryan Khan : షారుక్ ఖాన్ వారసుడి కెరీర్ షురూ.. వెబ్ సిరీస్ వస్తోంది

Aryan Khan Director Bads Of Bollywood Web Series

Aryan Khan : బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సినిమాల్లో హీరోగా నటిస్తారని అందరూ భావించారు. కానీ కొత్త ట్విస్ట్. ఆయన డైరెక్టర్‌గా అవతారమెత్తారు. నటనపై కాకుండా మూవీ డైరెక్షన్‌పై ఆర్యన్‌కు ఇంట్రెస్ట్ ఉంది. దీంతో ఆ దిశగానే ఆయనను షారుక్ ఎంకరేజ్ చేశారు. విదేశాలకు పంపి మరీ, మూవీ డైరెక్షన్‌లో ట్రైనింగ్ ఇచ్చారు. అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సినిమా కథలు రాయడంపై, సినిమాలకు డైరెక్షన్ చేయడంపై ఆర్యన్ కోర్సులు చేశారు.ఇవన్నీ జరిగాక.. తాజాగా ఆర్యన్ ఖాన్ ఒక వెబ్ సిరీస్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించారు. దాని పేరు..  ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’(Bads Of Bollywood). ఇందులో అతిథి పాత్రలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్ నటించబోతున్నారు.

Also Read :US Girl – AP Boy: ఏపీ అబ్బాయి కోసం అమెరికా అమ్మాయి వచ్చేసింది!

షారుక్.. తిరుగులేని మనిషి

షారుక్ ఖాన్ ఆలోచనా విధానం చాలా గొప్పది. బాలీవుడ్‌ బాద్‌షా స్థాయికి ఎదగడానికి షారుక్ చాలా శ్రమించారు. చిన్న స్థాయి నుంచి ఆత్మవిశ్వాసంతో ఎదిగారు. తనకు దొరికిన ప్రతీ చిన్న పాత్రలోనూ అద్భుతంగా షారుక్ నటించారు. ఈ పాత్రలే నటనపరంగా, డైలాగ్ డెలివరీపరంగా ఆయనను అందరిలో స్పెషల్‌గా నిలిపాయి. సినిమాల్లో డ్యాన్స్ కోసం, తగిన దేహ సౌష్టవం కోసం రాజీ లేని సాధన చేసే విషయంలో షారుక్‌కు షారుకే సాటి. షారుక్ చాలా ఇంటర్వ్యూల్లో ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ‘‘నా పిల్లలు కూడా నటనా రంగంలోకే రావాలనే రూలేం లేదు. వాళ్ల ఆసక్తికి అనుగుణంగానే నేను ప్రోత్సహిస్తాను’’ అని షారుక్ తెలిపారు.

Also Read :Phone Tapping Case : అమెరికాలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్.. పాస్‌పోర్ట్ రద్దు.. అదొక్కటే దిక్కు!

ఆర్యన్ వెబ్ సిరీస్‌లో.. 

చాలా కాలంగా షారుక్‌కు(Aryan Khan) చెందిన రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లోని రైటింగ్ విభాగంలో ఆర్యన్ ఖాన్ పనిచేస్తున్నారు. తన తండ్రి సినిమాల పలు స్టోరీల రైటింగ్‌లోనూ పరోక్షంగా ఆర్యన్ భాగమయ్యారు. తద్వారా సినిమా స్టోరీల రైటింగ్‌పై అవగాహన పెంచుకున్నారు. మూవీ డైరెక్షన్‌పై విదేశాల్లో ట్రైనింగ్ తీసుకొచ్చాక..  ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్‌ను తీశారు. దీని టైటిల్ విడుదలకు సంబంధించిన వీడియోల్లో స్వయంగా షారుక్ నటించారు. మొత్తం మీద ఈ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్స్‌లో బాబీ డియోల్,  మోనా సింగ్  నటిస్తున్నారు. అయితే వారి క్యారెక్టర్లపై ఇంకా క్లారిటీ లేదు. ఈ సిరీస్‌లో కొత్త నటుడు లక్ష్య  సహేర్ బంబా యాక్ట్ చేస్తున్నారు. కరణ్ జోహార్ కాస్తంత సుదీర్ఘమైన అతిధి పాత్రలో కనిపించబోతున్నారు.