Aryan Khan: లారిసా బొనేసి.. ఆర్యన్ ఖాన్ బ్రెజీలియన్ గర్ల్ ఫ్రెండ్.. ఎవరామె ?

  • Written By:
  • Updated On - April 3, 2024 / 11:47 AM IST

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య ఒక సారి డ్రగ్స్ కేసు విషయంలో ఆర్యన్ ఖాన్ పేరు బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలో మారుమోగిన విషయం తెలిసిందే. దాంతో కొద్దిరోజుల పాటు ఎక్కడ చూసినా కూడా ఆర్యన్ పేరు మారు మోగిపోయింది. ఆ తర్వాత మళ్లీ డేటింగ్ వార్తల విషయంలో అనేకసార్లు వార్తల్లో నిలిచారు ఆర్యన్. ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి ఆర్యన్ ఖాన్ పేరు మారుమోగుతోంది. బ్రెజిల్ మోడల్, నటితో ఆర్యన్ రిలేషన్షిప్ లో ఉన్నాడు అంటూ ముంబైలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

We’re now on WhatsApp. Click to Join

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తిక్క సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో లారిస్సా బొనెసి హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈమెతో ఆర్యన్ ఖాన్ డేటింగ్ చేస్తున్నాడు అంటూ ప్రస్తుతం వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఓన్లీ ఒట్టి వార్తలు మాత్రమే కాదండోయ్ ఒక నెటిజన్ ప్రూఫ్స్ కూడా చూపించాడు. నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్యన్ ఖాన్, లారిస్సా బొనెసి ఒకరిని మరొకరు ఫాలో అవుతున్నారు. అందులో తప్పు ఏముందని అంటారా? లారిస్సా ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లను కూడా ఆర్యన్ ఫాలో అవుతున్నారు.

Also Read: Mrunal Thakur: ప్రేక్షకులకు పాదాభివందనం చేసిన మృణాల్ ఠాకూర్.. వీడియో వైరల్!

అయితే ఓన్లీ ఒట్టి వార్తలు మాత్రమే కాదండోయ్ ఒక నెటిజన్ ప్రూఫ్స్ కూడా చూపించాడు. నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్యన్ ఖాన్, లారిస్సా బొనెసి ఒకరిని మరొకరు ఫాలో అవుతున్నారు. అందులో తప్పు ఏముందని అంటారా? లారిస్సా ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లను కూడా ఆర్యన్ ఫాలో అవుతున్నారు. ఆమె కూడా అంతే! ఆర్యన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఫాలో అవుతోంది. అంతే కాదు ఆర్యన్, లారిస్సా ఒక మ్యూజిక్ కాన్సర్ట్‌కు అటెండ్ అయ్యారు. అక్కడ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆర్యన్ ఖాన్, లారిస్సా బొనెసికీ ఎక్కడ పరిచయం అయ్యింది అని ఆరా తీస్తే.. షారుఖ్ కొడుక్కి ఒక క్లాతింగ్ బ్రాండ్ ఉంది. దానికి లారిస్సా మోడల్ గా వర్క్ చేసింది. ఆ టైంలో పరిచయమైందని టాక్. అంతే కాకుండా ఇటీవల ముంబై వచ్చిన లారిస్సా తల్లికి ఆర్యన్ ఖాన్ ఒక విలువైన జాకెట్ బహుమతిగా ఇచ్చారట. మరి, డేటింగ్ వార్తలో ఎంత నిజం ఉందో గానీ సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ పేరు ఒక్కసారిగా మార్మోగుతోంది. ఇప్పడు ఆర్యన్ ఖాన్ వయసు 26 సంవత్సరాలు. లారిస్సాకు 34 ఏళ్లు. వయసులో వాళ్లిద్దరి మధ్య వత్యాసం గురించి కూడా చర్చించుకుంటున్నారు నెటిజన్స్.

Also Read: Chiranjeevi: చిరంజీవి మొదట నిద్ర లేవగానే ఎవరి ఫోటో చూస్తారో తెలుసా?