Richest Actor of India: సంపాదనలోనూ బాద్ షా.. హాలీవుడ్ హీరోలను బీట్ చేసిన షారుఖ్ ఖాన్!

అత్యంత ధనవంతులైన నటుల జాబితాలో (Richest actors) షారుఖ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

Published By: HashtagU Telugu Desk

గత రెండేళ్లుగా తనకంటూ పెద్ద సినిమాలేవీ లేవు.. ఎండోర్స్ మెంట్స్ కూడా అంతగా లేవు. అయినా ఆస్తుల విషయంలో అందరి కంటే ముందే ఉన్నాడు. ఆయనే బాలీవుడ్ బాద్ షా  షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). తగ్గేదేలే అంటూ సంపాదనలో సైతం దూసుకుపోతున్నాడు ఈ హీరో. ఏకంగా హాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టి ఆశ్చర్యపర్చాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనవంతులైన నటుల జాబితాలో (Richest actors) షారుఖ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. నాలుగో స్థానంలో ఉన్న భారతీయ నటుడిగా ఆయన రికార్డ్ సృష్టించారు. వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్ ప్రపంచంలో అత్యంత సంపన్నులైన నటుల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌ లో షారుఖ్ నాలుగో (Shah Rukh Khan) స్థానంలో నిలిచారు. షారుఖ్‌ ఆస్తుల విలువ 6వేల కోట్ల రూపాయల పైమాటే. ఆస్తులు విలువలో షారుఖ్ ఖాన్ పలువురు హాలీవుడ్‌ హీరోలను కూడా వెనక్కు నెట్టేశాడు.

సినిమాలు లేవు అయినా ఎలా.. ? నాలుగేళ్లుగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన సినిమాలు రాలేదు. మధ్య మధ్యలో చిన్న చిన్న గెస్ట్ రోల్స్ చేసినా అవేవీ పెద్దగా ప్రభావాన్ని చూపేవి కావు. కానీ షారుఖ్ ఖాన్ వ్యాపార సామ్రాజ్యం, అడ్వర్టైజ్ మెంట్లు, ఒప్పందాలతో లైమ్ లైట్ లో ఉన్నారు. అత్యంత ఆస్తి ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐసీఐసీఐ (ICICI), బైజూస్, బిగ్ బాస్కెట్, లక్స్, హుండై సహా.. మొత్తం 14 సంస్థలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఏడాదికి 313 కోట్ల రూపాయల ఆదాయం ఆయనకు వస్తుందని అంచనా.

రెడ్ చిల్లీస్ నిర్మాణ సంస్థ, ఐపీఎల్ క్రికెట్ టీమ్ (IPL Cricket Team) కూడా ఆయనకు ఉన్నాయి. టామ్ క్రూజ్, జాకీ చాన్ వంటి హాలీవుడ్ దిగ్గజ నటుల సంపాదన కంటే షారుఖ్ ఖాన్ ఎంతో ఎత్తులో ఉన్నాడు. ప్రముఖ హాలీవుడ్‌ (Hollywood) కమెడియన్‌ జెర్రీ సైన్‌ ఫీల్డ్‌ 8 వేల కోట్ల రూపాయల ఆస్తితో సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. టైలర్ పెర్రీ రెండో స్థానం, డ్వేన్ జాన్సన్ మూడో స్థానంలో ఉండగా, షారుఖ్ ఖాన్ ప్రపంచ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. టామ్ క్రూజ్, జాకీ చాన్, జార్జ్ క్లూనీ, రాబర్ట్ డి నిరో ఆయన తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Also Read: Pawan Kalyan: పవన్ కు ‘కొండగట్టు’ సెంటిమెంట్.. వారాహికి రంగం సిద్ధం!

  Last Updated: 17 Jan 2023, 02:42 PM IST