ఇటీవల సినీ పరిశ్రమలోకి కొత్త కొత్త హీరోలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక సీరియల్స్ తో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటులు కూడా సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు మరో సీరియల్ నటుడు హీరోగా మారబోతున్నాడు. కన్నడ పరిశ్రమకు చెందిన ముకేశ్ గౌడ(Mukesh Gowda) కన్నడలో, తెలుగులో పలు సీరియల్స్(Serials) తో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇటీవల తెలుగులో గుప్పెడంత మనసు(Guppedantha Manasu) సీరియల్ లో రిషి క్యారెక్టర్ తో బాగా ఫేమస్ అయ్యాడు ముకేశ్ గౌడ. తెలుగులో అభిమానులని, ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. ఈ సీరియల్ కి ప్రస్తుతం మంచి రేటింగ్ వస్తుంది. దీంతో రిషి క్యారెక్టర్ తో ఫేమస్ అయినా ఈ ముకేశ్ గౌడ ఇప్పుడు తెలుగులో హీరోగా మారబోతున్నాడు.
ఎస్.ఎస్.ఎం.జి ప్రొడక్షన్స్ పతాకంపై ముఖేష్‌గౌడ, ప్రియాంక శర్మ(Priyanka Sharma) జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా సినిమా అటైటిల్ ని ప్రకటించి పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘గీతా శంకరం’ అనే టైటిల్ ప్రకటించారు. పల్లెటూరు ప్రేమ కథగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. మరో వారం రోజుల్లో గీతా శంకరం షూటింగ్ మొదలుపెడతారని తెలిపారు చిత్రయూనిట్.
తెలుగులో సినిమా హీరోగా మారడంపై ముఖేష్ గౌడ మాట్లాడుతూ… ఈ దీపావళి కానుకగా నేను నటిస్తున్న తొలి సినిమా ఫస్ట్‌లుక్ లాంచ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథకు నన్ను హీరోగా సెలక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. సీరియల్స్‌లో ఎలా మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నానో, ఈ సినిమాతో వెండితెర మీద కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే గట్టి నమ్మకం ఉంది అని తెలిపాడు.
Also Read : Krishna Statue : సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఆవిష్కరించిన కమల్ హాసన్.. వైసీపీ నాయకుడి ఆధ్వర్యంలో..