Naresh : సీనియర్ నటుడు నరేష్‌కి ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసా..?

పవిత్ర లోకేష్(Pavithra Lokeesh) కంటే ముందు నరేష్ ముగ్గుర్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అందరికి ఈ పెళ్లిళ్లు వరుకే తెలుసు. అసలు నరేష్ కి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది మీలో ఎంతమందికి తెలుసు..?

Published By: HashtagU Telugu Desk
Senior Hero Naresh Wifes and Childrens details

Senior Hero Naresh Wifes and Childrens details

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్(Naresh) గురించి తెలియని వారు ఎవరు ఉండరు. తన విలక్షణ నటన, కామెడీ టైమింగ్ తో ఒక యాక్టర్ గా ఇప్పటి ఆడియన్స్ లో కూడా ఎంత గుర్తింపుని సంపాదించుకున్నాడు. అయితే పవిత్ర లోకేష్ తో ప్రేమ, పెళ్లి వ్యవహారంతో ప్రేక్షకుల్లో అంతకన్నా ఎక్కువే రిజిస్టర్ అయ్యాడు. పవిత్ర లోకేష్(Pavithra Lokeesh) కంటే ముందు నరేష్ ముగ్గుర్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అందరికి ఈ పెళ్లిళ్లు వరుకే తెలుసు. అసలు నరేష్ కి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది మీలో ఎంతమందికి తెలుసు..?

ప్రముఖ సీనియర్ డాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తెను నరేష్ మొదటి వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ ‘నవీన్ విజయ్ కృష్ణ’ అనే ఒక బాబు కూడా పుట్టాడు. అయితే బాబు పుట్టిన తరువాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడాకులతో విడిపోయారు. ఆ తరువాత ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణ శాస్త్రి మనవరాలిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి కూడా ఒక బాబు పుట్టాడు. ఇక మూడో భార్య రమ్య రఘుపతి గురించి అందరికి తెలిసిందే. ఈమె ప్రముఖ రాజకీయనాయకుడు రఘువీరారెడ్డి సోదరుడు కుమార్తె.

రమ్య రఘుపతితో కూడా నరేష్ ఒక బాబుకి జన్మనిచ్చాడు. ఇక వీరిద్దరి మధ్య గొడవలు రావడం, ఈ మధ్యలో పవిత్ర లోకేష్ తో ప్రేమ మొదలవడం వంటి విషయాలు అందరికి తెలిసిందే. నరేష్ మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకోగా ముగ్గురు భార్యలతో ముగ్గురు మగబిడ్డలకు తండ్రి అయ్యాడు. పవిత్రని అధికారికంగా వివాహం చేసుకున్నాడా లేదా అనేది మాత్రం తెలియదు. కాగా నవీన్ కి ఉన్న ముగ్గురు పిల్లల్లో ఫస్ట్ వైఫ్ కొడుకు ‘నవీన్ విజయ్ కృష్ణ’ మాత్రమే ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో ఎడిటర్ గా కెరీర్ మొదలు పెట్టిన నవీన్ హీరోగా రెండు సినిమాల్లో కూడా నటించాడు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ ని హీరోగా పెట్టి సత్య అనే షార్ట్ ఫీచర్ ఫిలింని కూడా తీశాడు.

 

Also Read : Venu Thottempudi : ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి హీరో.. అతిథి అంటూనే భయపెట్టడానికి రెడీ అయ్యాడు..

  Last Updated: 08 Sep 2023, 08:05 PM IST