Site icon HashtagU Telugu

Senior Actor Passes Away: టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు మృతి

Veeramachaneni Pramod Kumar

Resizeimagesize (1280 X 720) (7)

తెలుగు చిత్ర పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ లో ప్రముఖ సీనియర్ నటుడు (Senior Actor Passes Away) కన్నుమూశారు. ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, నిర్మాత వీరమాచినేని ప్రమోద్ కుమార్ (87) (Veeramachaneni Pramod Kumar) కన్నుమూశారు. అనారోగ్యంతో మంగళవారం (మార్చి 21) తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి టాలీవుడ్‌కు విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Rashmika Failed: బాలీవుడ్ లో రష్మిక మందన్న ఫెయిల్.. ఆశలన్నీ టాలీవుడ్ పైనే!

ప్రమోద్.. నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినిమా అనుభవాల గురించి ‘తెర వెనుక తెలుగు సినిమా’ అనే పుస్తకాన్ని రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుకు ఎంపికైంది. పబ్లిసిటీ ఇన్‌ఛార్జ్‌గా పాపులర్ అయిన ఆయన దాదాపు 300 సినిమాలకు పనిచేశారు. ఈ 300 సినిమాల్లో 31 సినిమాలు శతదినోత్సవ వేడుకలు జరుపుకున్నాయి. తెర వెనుక తెలుగు సినిమా పుస్తకం నంది అవార్డు గెలుచుకుంది. ప్రమోద్ కుమార్ మరణించడంతో టాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు సంతాపం తెలుపుతున్నారు. వీరమాచినేని ప్రమోద్ కుమార్ విజయవాడలో తన నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.