Pawan Kalyan : ఒక కథని రాసుకోవడానికి దర్శక రచయితలకు ఏదొక మీడియం కావాల్సి ఉంటుంది. ఇక ఆ మీడియం ఓ సంఘటన అవ్వొచ్చు, చరిత్ర అవ్వొచ్చు, వ్యక్తి అవ్వొచ్చు, అంతెందుకు మాట, పాట కూడా అవ్వొచ్చు. అయితే చాలామంది రచయితల దగ్గర నుంచి వినిపించే విషయం ఏంటంటే.. పలానా సన్నివేశాన్ని పలానా వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని రచించాం అని చెబుతుంటారు.
ఈక్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని చాలామంది కథలు రాసుకుంటుంటారు. అలా ఓ హిట్టు కథని రాసుకున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. కానీ ఆ కథని పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. మరో హీరోతో ఆ కథని తెరకెక్కించి సూపర్ హిట్టుని అందుకున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి..? పవన్ తో కాకుండా ఏ హీరోతో ఆ సినిమాని చేసారు..?
శేఖర్ కమ్ముల ‘డాలర్ డ్రీమ్స్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నా దర్శకుడిగా ఆడియన్స్ లో గుర్తింపు రాలేదు. శేఖర్ కమ్ములకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం అంటే.. ‘ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ రెండొవ చిత్రం కథని పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నారట.
ఆ సమయంలో పవన్ ఖుషి, బద్రి, తమ్ముడు, తొలిప్రేమ వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకునేవారు. ఈ కారణంతోనే శేఖర్ కమ్ముల, పవన్ ని దృష్టిలో పెట్టుకొని ఆనంద్ వంటి యూత్‌ఫుల్ లవ్ స్టోరీని రాసుకున్నారు. కానీ ఆ సినిమాని పవన్ తో చేయడానికి ప్రయత్నించలేదు. కేవలం కథ కోసం ఆయనని మీడియంగా ఉపదయోగించుకున్నారు అంతే.
ఇక ఆ చిత్రాన్ని అప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న ‘రాజా’తో తెరకెక్కించి సూపర్ హిట్టుని అందుకున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా కమలినీ ముఖర్జీ నటించారు. ఇక ఈ పాత్రలో కూడా ముందుగా అసిన్ అండ్ సదాని అనుకున్నారట. కానీ ఫైనల్ గా కమలినీతో ఆ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
Also read : Kalki 2898 AD : యానిమేటెడ్ టీజర్‌తో కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయబోతున్న కల్కి..