Site icon HashtagU Telugu

Sekhar Kammula : పవన్ తో ఆ సినిమా చేయాలనుకున్న శేఖర్ కమ్ముల..!

Sekhar Kammula Plan that movie with Pawan Kalyan

Sekhar Kammula Plan that movie with Pawan Kalyan

Sekhar Kammula టాలీవుడ్ లో ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్స్ లో ఒకరు శేఖర్ కమ్ముల. ఆయన డైరెక్షన్ లో సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ అంతా అలర్ట్ అవుతారు. లవ్ స్టోరీ తర్వాత కోలీవుడ్ స్టార్ ధనుష్ తో కుబేర అంటూ పాన్ ఇండియా సినిమాను మొదలు పెట్టాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో ధనుష్ తో పాటు కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారని తెలిసిందే.

అయితే శేఖర్ కమ్ముల మొదటి సినిమా ఆనంద్ సినిమాలో రాజా, కమిలిని ముఖర్జీ కలిసి నటించారు. అయితే ఆ సినిమాను పవన్ తో చేయాలని అనుకున్నాడట శేఖర్ కమ్ముల. పవన్ తో చేయాలని అనుకున్నా ఆయన్ను కలవడం కుదరలేదట. అందుకే రాజాతో చేసినట్టు ఆమధ్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అంతేకాదు హీరోయిన్ గా కమిలిని ముఖర్జీ ఫస్ట్ ఆప్షన్ కాదని స్టార్ హీరోయిన్ ని అనుకుంటే ఆమె చివరి నిమిషంలో కాదనే సరికి కమిలిని ముఖర్జీని తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఆనంద్ సినిమా తోనే శేఖర్ కమ్ముల తన మార్క్ చూపించారు. అయితే ఈ సినిమా లో పవన్ నటిస్తే ఎలా ఉంటుందో అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు.

Also Read : Nabha Natesh : నభా నటేష్ పాన్ ఇండియా ఛాన్స్.. నిఖిల్ భారీ సినిమాలో అలాంటి పాత్రలో..!