Site icon HashtagU Telugu

Sedition Case : విజయ్ దేవరకొండపై దేశ ద్రోహం కేసు..?

Vijaydevarakonda Case

Vijaydevarakonda Case

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror)పై చేసిన వ్యాఖ్యలతో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda ) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల కోలీవుడ్ నటుడు సూర్య చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్, ఆ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు గిరిజన సంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి. పహల్గాం ఘటనను గతంలో గిరిజనుల మధ్య జరిగిన ఘర్షణలతో పోల్చడమే కాకుండా, ఉగ్రవాదులను కామన్ సెన్స్ లేని వారిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Amaravati Relaunch : అమరావతి రీ లాంఛ్ వేడుకకు చిరంజీవి రాకపోవడానికి కారణం అదేనా..?

ఈ వ్యవహారంపై హైదరాబాద్‌కి చెందిన న్యాయవాది లాల్ చౌహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ దేవరకొండపై దేశద్రోహానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన సంఘాలు కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాయి. వెంటనే విజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయాన్ని పోలీసు అధికారులు సీరియస్‌గా తీసుకొని, చట్టబద్ధంగా దర్యాప్తు చేపడతామని చెప్పారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ “కింగ్‌డమ్” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు సినిమాకే నెగెటివ్‌గా మారుతున్నాయని పరిశ్రమలో పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం నేపథ్యంలో విజయ్ ఎలా స్పందిస్తారో, క్షమాపణ చెబుతారో లేదా ఇంకా వివరణ ఇస్తారో చూడాలి.