Satyadev Krishnamma : వారంలోనే OTT రిలీజ్.. సత్యదేవ్ కృష్ణమ్మ మరీ ఇంత ఘోరమా..!

Satyadev Krishnamma థియేటర్ బిజినెస్ కు ఇప్పటికే OTTలు చాలా బొక్క పెడుతున్నాయని తెలిసిందే. చాలామంది ప్రేక్షకులు డైరెక్ట్ గా ఓటీటీలో వచ్చే సినిమాలనే చూస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Satyadev Krishnamma Release In Ott With One Week

Satyadev Krishnamma Release In Ott With One Week

Satyadev Krishnamma థియేటర్ బిజినెస్ కు ఇప్పటికే OTTలు చాలా నష్టం కలిగిస్తున్నాయని తెలిసిందే. చాలామంది ప్రేక్షకులు డైరెక్ట్ గా ఓటీటీలో వచ్చే సినిమాలనే చూస్తున్నారు. ఇక థియేట్రికల్ సినిమాలు కూడా నెల లోపే డిజిటల్ రిలీజ్ అవుతుండటం వల్ల అందులోకి వచ్చాక చూద్దాం లే అనుకుంటున్నారు. అయితే కొన్ని సినిమాలు థియేట్రికల్ రన్ సరిగా లేకపోతే నెల కాదు 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

అయితే లేటెస్ట్ గా సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ సినిమా మరీ ఘోరంగా వారం రోజుల్లోనే ఓటీటీలో రిలీజైంది. వీవీ గోపాల కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సత్యదేవ్, అనిత రాజ్ జంటగా నటించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ మొదటిసారి సమర్పకుడిగా వ్యవహరించిన సినిమా ఇది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి. అనిల్ రావిపుడి లాంటి అగ్ర దర్శకులు అటెండ్ అయ్యారు.

సినిమాను ఎంతమంది ప్రమోట్ చేసినా అక్కడ మ్యాటర్ లేకపోతే ఆడియన్స్ తిప్పికొడతారు. కృష్ణమ్మ సినిమాతో మరోసారి అది ప్రూవ్ అయ్యింది. సత్యదేవ్ యాక్టింగ్ పరంగా బాగున్నా ఈ సినిమా రెగ్యులర్ రివెంజ్ డ్రామాగా అనిపించడంతో సినిమా ప్రేక్షకులకు ఎక్కలేదు. మే 10న థియేట్రికల్ రిలీజైన ఈ సినిమా వసూళ్లు నామమాత్రంగానే ఉండటంతో వారం లోనే ఓటీటీలోకి వదిలారు.

అంతకుముందు నిర్మాతలు పెట్టుకున్న 90ల రోజుల ఓటీటీ కండీషన్స్ ఏమయ్యాయో కానీ కృష్ణమ్మ సినిమా వారం తిరగకుండానే ఓటీటీలో దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కృష్ణమ్మ సినిమా ప్రైం వీడియోలో అందుబాటులో ఉంది.

Also Read : War 2 Special Song Katrina Kaif : వార్ 2 స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా ఆమెను దించుతున్నారా..?

  Last Updated: 17 May 2024, 12:52 PM IST