Site icon HashtagU Telugu

Satya Dev : ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న సత్య దేవ్.. దీపావళి బరిలో..

Satya Dev Announced his First Pan Indian Movie Zebra

Zebra

Satya Dev : జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ప్రస్తుతం హీరోగా, విలన్ గా సినిమాలు చేస్తున్నాడు సత్య దేవ్. చివరగా సత్య దేవ్ కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా నిరాశపరిచింది. తాజాగా తన కొత్త సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు సత్య దేవ్.

సత్య దేవ్ ఇప్పుడు జీబ్రా సినిమాతో రాబోతున్నాడు. నేడు జీబ్రా సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి అందులోని నటీనటులను పరిచయం చేస్తూ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. జీబ్రా సినిమాలో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలి ధనుంజయ, సత్యరాజ్, ప్రియా భవాని శంకర్, సత్య, సునీల్, జెన్నిఫర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక జీబ్రా సినిమాని ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిలిమ్స్ బ్యానర్స్ పై SN రెడ్డి, పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని దీపావళికి అక్టోబర్ 31న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో దీపావళి బరిలో సత్యదేవ్ కూడా నిలిచాడు. జీబ్రా సినిమా సత్యదేవ్ కి మొదటి పాన్ ఇండియా సినిమా కానుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

Also Read : Tasty Teja : వేలంపాటలో వినాయకుడి లడ్డు దక్కించుకొని ఊరంతా ఊరేగింపు చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్..