నాని (Nani) వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం ( Saripoda Shanivaram ) సినిమా చేసాడు. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి ‘అంటే సుందరానికీ’ సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ పర్వాలేదు అనిపించుకుంది. అయినప్పటికీ నాని మరోసారి ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తూ సినిమా చేసాడు. ఈ మూవీని RRR ఫేమ్ దానయ్య నిర్మించారు.
We’re now on WhatsApp. Click to Join.
డైరెక్టర్ ఎస్‌జే సూర్య ఇందులో విలన్ పాత్రలో నటించడం విశేషం. భారీ అంచనాల నడుమ ఈరోజు ( ఆగస్టు 29 న) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు నాని యాక్టింగ్ కు ఫిదా అవుతూ..నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని కామెంట్స్ చేస్తున్నారు. నాని, ఎస్ జే సూర్యల పర్ఫామెన్స్ అదిరిపోయిందని, యాక్షన్ సీక్వెన్స్ ఫీస్ట్‌లా ఉంటుందట. ఆర్ఆర్ మాత్రం పగిలిపోయిందంటూ ట్వీట్లు వేస్తున్నారు.
ఇదిలా ఉంటె..ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ తీసుకుంది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారని..ఆ అగ్రిమెంట్ ప్రకారం సినిమా రిలీజ్ అయినా 45 రోజుల్లో ఓటిటి లో ప్రసారం కాబోతున్నమాట.
Read Also : Rohit Sharma: రోహిత్ కోసం ఎల్‌ఎస్‌జీ రూ.50 కోట్లు వెచ్చించనుందా..?