Sapthagiri : కమెడియన్ సప్తగిరి మధ్యమధ్యలో హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి పెళ్లి కానీ ప్రసాద్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా మార్చ్ 21న రిలీజ్ కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో సప్తగిరి పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
సప్తగిరికి ప్రస్తుతం 36 ఏళ్ళు. అయినా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీంతో పెళ్లి కానీ ప్రసాద్ సినిమా ప్రమోషన్స్ లో సప్తగిరి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి సప్తగిరి సమాధానమిస్తూ.. ఎవరైనా పిల్ల ఉంటే చూడండి. నేను చేసుకోడానికి రెడీ. ప్రామిస్ గా చెప్తున్నా సినిమా వాళ్లకు ఎవరూ పిల్లను ఇవ్వట్లేదు. ఇది నిజం. మనం ఎంత పేరు సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, మనకి మంచి అలవాట్లు ఉన్నా సినిమా వాడా అయితే వద్దు అంటున్నారు. ఎందుకో నాకు అర్ధం కావట్లేదు. ఒకరకంగా అదే సమస్య అని చెప్పుకొచ్చారు.
గతంలో సినిమావాళ్లు అంటే పిల్లనివ్వరు అనే మాట బాగా పాపులర్ అయింది. నిజంగానే సినిమావాళ్లు అంటే ఏదో నెగిటివ్ గా చూసేసి పిల్లని ఇచ్చేవాళ్ళు కాదు. ఎలాంటి అలవాట్లు లేకుండా మంచిగా సంపాదించుకుంటూ సెటిల్ అయినా కూడా ఇప్పటికి సినిమా వాళ్లకు పిల్లని ఇవ్వట్లేదు అంటే ఆశ్చర్యకర విషయమే. సినిమా వాళ్ళను ఓ పక్కన సెలబ్రిటీలుగా చూస్తారు, వాళ్ళతో ఫోటోలు కావాలి కానీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినా పెళ్ళికి మాత్రం పిల్లను ఇవ్వరు అనే ధోరణి ఇంకా మారలేదు అంటే ఆలోచించాల్సిన విషయమే.
ఇక ఇదే ప్రెస్ మీట్ లో సప్తగిరి మాట్లాడుతూ.. నేను కమెడియన్. మా డైరెక్టర్ చాలా మంది పేరు ఉన్న హీరోయిన్స్ ని సినిమాలోకి తీసుకుందామని ట్రై చేసాడు. కానీ కమెడియన్ పక్కన చేయమని ఆ హీరోయిన్స్ రిజెక్ట్ చేసారు. చివరకు ప్రియాంక శర్మ అంగీకరించింది అని తెలిపాడు. ఒకప్పుడు సౌందర్య లాంటి స్టార్ హీరోయిన్ సైతం బాబు మోహన్ లాంటి కమెడియన్ పక్కన డ్యాన్సులు వేసింది. ఇంద్రజ లాంటి హీరోయిన్ అలీ పక్కన నటించింది. అప్పటి హీరోయిన్స్ నటుడు ఎవరైనా సినిమా ఇంపార్టెంట్ అనుకునేవాళ్లు. ఇప్పుడు మాత్రం హీరో, కాంబినేషన్స్ ఇంపార్టెంట్ అయ్యాయి.
Also Read : Pawan Kalyan : హిందీ భాష పై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన