Site icon HashtagU Telugu

Sankranthiki Vasthunnam Sequel : ‘సంక్రాంతికి వస్తున్నాం’ కు సీక్వెల్ రాబోతోంది..!

sankranthiki vasthunnam sequel

sankranthiki vasthunnam sequel

విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

2025 సంక్రాంతి (Sankranti ) బరిలో అసలైన బ్లాక్ బస్టర్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthi Vasthunnam ) మూవీ నిలిచింది. సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ప్రేక్షకులు బ్రహ్మ రధం పడతారని మరోసారి రుజువైంది. వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీ లో నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీటీఎస్ గణేష్, ఉపేంద్ర లిమాయే తదితరులు ప్రధాన పాత్రలు పోషించగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Ranji Trophy: రంజీ ట్రోఫీలో ఆడేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన స్టార్ ఆట‌గాళ్లు వీరే!

విడుదలకు ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ మూవీ..విడుదల తర్వాత మొదటి ఆట తోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.130+ కోట్ల కలెక్షన్లు రాబట్టగా నిన్నటితో కలిపి రూ.161కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే, కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్ పొందడంతో బాక్స్ ఆఫీస్ను రూల్ చేస్తోందని వెల్లడించాయి. షోలు పెరిగినప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని , చాలామంది టికెట్స్ దొరకక వెనుతిరుగుతున్నారని తెలిపారు.

ఇదిలా ఉంటె ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధం చేస్తున్నట్లు డైరెక్టర్ అనిల్ తెలిపి అభిమానుల్లో సంతోషం నింపారు. ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకు ఆ స్పేస్ ఉంది. రాజమండ్రిలో ఎండ్ అయింది కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ కావొచ్చు. మరో మిరాకిల్ సృష్టిస్తామేమో’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి ఈ సీక్వెల్ ను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి. గతంలో ఎఫ్ 2 కు ఎఫ్ 3 తెరకెక్కించి హిట్ అందుకున్నాడు.