విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ( Sankranthiki Vasthunam) సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ తర్వాత వెంకటేశ్ – దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతుండడం.. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు దీనిని నిర్మించడం తో పాటు ఇటీవల విడుదలైన సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ అంచనాలు పెంచేసింది. సోమవారం చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.
Hyd : రన్నింగ్ కారులో మంటలు.. ఇద్దరు సజీవదహనం
ట్రైలర్ విషయానికి వస్తే.. ఎవరో కిడ్నాప్ అయితే అది బయటకు వస్తే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని వాళ్ళను కాపాడటానికి ఎక్స్ పోలీస్ అయిన వెంకటేష్ ని తీసుకురావడానికి పోలీస్ మీనాక్షి ని పంపిస్తారు. అప్పటికే పెళ్లి అయి ఉన్న వెంకటేష్ లైఫ్ లోకి వచ్చాక భార్య, మాజీ ప్రేయసి మధ్యలో వెంకీ పాత్ర ఎలా నలిగింది. ఆ కిడ్నాప్ కథేంటి అని సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ అయితే ఫుల్ కామెడీ ఎంటర్టైనింగ్ గా ఉంది. మరి మీరు కూడా ఈ ట్రైలర్ పై లుక్ వెయ్యండి.