సందీప్ వంగ (Sandeep Vanga) డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. థియేట్రికల్ వెర్షన్ 1000 కోట్ల దాకా వసూలు చేసింది. ఈమధ్యనే ఓటీటీ రిలీజైన ఈ సినిమా ఇక్కడ కూడా ఓ రేంజ్ లో హంగామా సృష్టిస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉన్న యానిమల్ డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా రికార్డులు సృష్టిస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
ఇక ఈ సినిమా ఎండింగ్ లో యానిమల్ పార్క్ ని అనౌన్స్ చేశాడు సందీప్ వంగ. యానిమల్ ని కొనసాగిస్తూ ఈ సినిమా చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ యానిమల్ పార్క్ విషయంలో సందీప్ ప్లాన్ ఎలా ఉంది అన్నది తెలియాల్సి ఉంది. యానిమల్ తర్వాత కొంత టైం తీసుకుని వెంటనే ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయాలని చూస్తున్నాడు సందీప్ వంగ. ఈ సినిమాను 2025 లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. స్పిరిట్ మొదలయ్యే లోగానే యానిమల్ పార్క్ కథ పూర్తి చేసేలా సందీప్ ప్లాన్ చేస్తున్నాడు.
రణ్ బీర్ కూడా సందీప్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు షూటింగ్ రెడీ అంటున్నాదు. సో 2025 లో ఈ సినిమా మొదలు పెట్టి 2026 లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. యానిమల్ పార్క్ లో రణ్ బీర్ రష్మిక రిలేషన్ తో పాటుగా రన్ బీర్ అతని కొడుకు మధ్య కథ నడుస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో రణ్ బీర్ డబుల్ యాక్షన్ చేస్తారని టాక్. సందీప్ వంగ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు.
Also Read : Sraddha Srinath for Balakrishna : బాలయ్యకు జోడీగా నాని హీరోయిన్..!